బండి అంతగా సోమూ దూసుకు పోలేక పోతున్నాడేం.. ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నాడు
somu veerraju: తెలంగాణలో మరో పది సంవత్సరాల వరకు తనకు తిరుగు లేదని భావిస్తున్న కేసీఆర్ కు బీజేపీ వర్గాల వారికి అనూహ్యంగా దుబ్బాక మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు షాక్ ను ఇచ్చాను. ఆ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరానికి చేర్చిన బండి సంజయ్ అంటే ఇప్పుడు టీఆర్‌ఎస్ వర్గాల వారు భయపడే పరిస్థితి ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న విషయాన్ని కూడా పట్టుకుని రచ్చ చేయడంలో బండి తర్వాతే మరెవ్వరైనా అన్నట్లుగా పరిస్థితి ఉంది. బండి సంజయ్ నుండి వస్తున్న డైలాగ్ లతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కొన్ని సందర్బాల్లో కనీసం సమాధానం చెప్పలేక పోతున్నారు. బండి సంజయ్ వల్ల తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
somu veerraju : కనిపించని సోము ప్రభావం..
తెలంగాణలో బీజేపీ కొత్త బాస్ గా బాధ్యతలు చేప్పటినప్పటి నుండి బండి సంజయ్ అనూహ్యంగా దూసుకు పోతున్నాడు. ఫైర్ బ్రాండ్ గా పేరు దక్కించుకున్న బండి సంజయ్ మాదిరిగానే సోము వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా సోము బండి మాదిరిగా ఏపీలో బీజేపీకి జవసత్వాలు నింపుతాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా సోమూ వీర్రాజు వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. అప్పుడప్పుడు ఆయన బాంబుల మాదిరిగా మాటల తూటాలు అయితే వదులుతున్నాడు. కాని ఎక్కడో లాజిక్ మిస్ అయ్యి సోము మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అందుకే జనాలు ఆయన మాటలు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
somu veerraju : సోము ఒక్క అడుగు ముందుకు అయిదు అడుగులు వెనక్కు..
ఏపీలో బీజేపీని విజయ పథంలోకి నడిపించడం అంటే సాధ్యం అయ్యే విషయం కాదు. కాని గౌరవ ప్రథమైన అసెంబ్లీ స్థానాలను ఒకటి రెండు పార్లమెంటు స్థానాలను దక్కించుకున్నా కూడా ఖచ్చితంగా సోము ఘన విజయం సాధించినట్లే. కాని సోము వీర్రాజు ఒక్క అడుగు ముందుకు వేస్తే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అయిదు అడుగులు వెనక్కు పడుతున్నాయి. ఈ పరిణామం ఏమాత్రం సహించడం లేదు. సోము వీర్రాజు ఎన్నిక విషయంలో అందరు సంతృప్తిగా కూడా లేరు. ఆయన్ను తప్పించాలని ఇప్పటికి కొందరు డిమాండ్ చేస్తున్నారు. అందరిని కలుపు పోవడంలో ఆయన విఫలం అయినట్లే అనిపిస్తున్నాడు. బండి సంజయ్ మాదిరిగా మాటల తూటాలు పేల్చడంతో పాటు పార్టీలో ఐకమత్యం ను సోము వీర్రాజు క్రికయేట్ చేయాలి.