Bandi Sanjay : ఖబడ్దార్.. నీ సంగతేందో తేలుస్తా? కోపంతో ఊగిపోయిన బండి సంజయ్?
Bandi Sanjay : బండి సంజయ్ తెలుసు కదా. ఆయనలో ఫైర్ ఎలా ఉంటుందో.. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో?.. ఎదుటి వాళ్లకు వార్నింగ్ ఇస్తే ఇలా ఉంటుందో కూడా తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. బండి సంజయ్ కి తెలంగాణలో ఉన్న ఫాలోయింగే వేరు. అది వేరే లేవల్ అప్పా. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా వార్నింగ్ ఇచ్చి గుక్క తిప్పుకోకుండా చేసేంత కెపాసిటీ ఉంది సంజయ్ కి. అందుకే సంజయ్ కి తెలంగాణలో ఫాలోయింగ్ ఎక్కువై పోయింది. రేపు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. నో డౌట్.. బండి సంజయే ముఖ్యమంత్రి అయ్యే చాన్సెస్ ఉన్నాయి.
అందుకే తెలంగాణలో ఏ సమస్య వచ్చినా.. బీజేపీ పార్టీకి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా.. బండి సంజయ్ ముందుండి పరిష్కరిస్తున్నారు. అయితే.. తాజాగా సూర్యాపేట జిల్లాలోని గుర్రంబోడు తండాలో భూముల వ్యవహారం రచ్చ రచ్చ అయిన సంగతి తెలిసిందే.
అక్కడ గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించినందుకు వాళ్లను వేధింపులకు గురి చేస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay : తెలంగాణలో రాక్షస పాలన సాగుతోంది
ఈ సందర్భంగా గిరిజనుల భూముల ఆక్రమణ గురించి మాట్లాడిన బండి.. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందన్నారు. బెంగాల్ లో ఏం జరుగుతోందో.. అచ్చం అలాగే తెలంగాణలో జరుగుతోందన్నారు. బీజేపీ నేతలను సీఎం కేసీఆర్ అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
గుర్రంబోతు తండాలో టీఆర్ఎస్ పార్టీ గుంటనక్కలు, కాంగ్రెస్ నాయకులు చేతులు కలిపి.. గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారు. ప్రశ్నించిన వాళ్లను వేధిస్తున్నారు. గిరిజనుల భూములను లాక్కొని.. వాళ్లపైనే అదనంగా కేసులు బనాయించి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించి.. జైలులో పెట్టి గిరిజనులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
గిరిజలను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. వాళ్లకు మద్దతుగా ప్రశ్నిస్తే.. బీజేపీ కార్యకర్తలను వేధిస్తారా? ఖబడ్దార్.. ఐజీ ప్రభాకర్ రావు.. నువ్వు సీఎంకు గలాంగిరి చేస్తే ఊరుకుంటామా? వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. నీ సంగతి తేలుస్తా. మళ్లీ సూర్యాపేటకు వస్తా. ఈసారి పదులు, వందలు కాదు.. వేలాది మంది కార్యకర్తలతో వచ్చి గుర్రంబోడు తండాను పర్యవేక్షిస్తా. అప్పుడు నువ్వు ఎలా అడ్డుకుంటావో చూస్తా? అంటూ ఐజీకి బండి సంజయ్ సవాల్ విసిరారు.