Nagababu : ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ కొంపముంచేది నాగబాబే !
Nagababu : ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. వారాహి యాత్ర నేపథ్యంలో ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో జనసేనకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను నాదెండ్ల మనోహర్, నాగబాబు చూసుకుంటున్నారు. నాగబాబు జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నాగబాబు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిజానికి అది చాలా పెద్ద ప్రెస్ నోట్. అందులో చాలా మాటలు వివరించారు. విప్లవ శంఖారావం, రాజకీయ అనిశ్చితి, చారిత్రక ఘట్టం అంటూ పెద్ద పెద్ద మాటలు వాడారు. దేనికోసం అంటారా? అదేనండి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టి వారాహి యాత్ర గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవి.
వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించబోతోంది అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ యాత్ర కోసం జనసైనికులే కాదు.. చాలామంది వెయిట్ చేస్తున్నారంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. అసలు జనసేన పార్టీకి ఏదైనా అజెండా ఉందా? మేనిఫెస్టో ఉందా? పొత్తు ఉంటుందా? లేదా? దేనిపై కూడా క్లారిటీ లేదు. అసలు ఆ పార్టీకి ఒక అజెండానే లేదు. కనీసం ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు. ఏపీలో ఉన్న అన్ని సీట్లలో పోటీ చేస్తారా? లేక కొన్ని సీట్లలోనేనా అనేదానిపై క్లారిటీ లేదు. అసలు ఏం ప్లాన్ చేసుకోకుండా వారాహి యాత్ర అంటూ జనాల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రమే తెలుసు పవన్ కళ్యాణ్ కు. ఇవన్నీ లేకున్నా.. దాన్ని ఒక రాజకీయ విప్లవ శంఖారావంతో పోల్చే నాగబాబును ఏమనాలి.
Nagababu : వారాహి యాత్ర ఎందుకు ఇన్నిసార్లు వాయిదా పడింది
వారాహి యాత్ర ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలుసు కదా. చివరకు మొన్న 14వ తేదీన ప్రారంభం అయింది. అందుకే నాగబాబు ఒక లేఖను వదిలారు. అసలు ఏపీలో రాజకీయ అనిశ్చితి ఉందని.. ఏదేదో చెప్పుకొచ్చారు. కానీ.. అసలు ఏపీలో రాజకీయ అనిశ్చితి ఎక్కడ ఉంది. ప్రతిపక్షాల్లోనే అది స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఏ పార్టీ దేనితో పొత్తు పెట్టుకుంటుందో తెలియడం లేదు. పొత్తులు ఎంత దూరం వెళ్తాయో కూడా అర్థం కావడం లేదు. బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీల పొత్తుపై క్లారిటీ లేదు. అసలు జనసేన పార్టీకే ఏ విషయంలో క్లారిటీ లేదు కానీ.. ఎందుకు ఇలా అధికార పార్టీపై మాత్రం దుమ్మెత్తిపోస్తోందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నాగబాబు నీ దగ్గర సమాధానం ఉందా మరి.