MLA Parthasarathy : పార్టీ బుజ్జగిస్తున్న మెత్తబడని ఎమ్మెల్యే పార్థసారథి..!
ప్రధానాంశాలు:
MLA Parthasarathy : పార్టీ బుజ్జగిస్తున్న మెత్తబడని ఎమ్మెల్యే పార్థసారథి..!
MLA Parthasarathy : మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. పెనమలూరు ఎమ్మెల్యే సీటు కాదని పార్థసారధికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని వైసీపీ హై కమాండ్ చెప్పడంతో రచ్చరచ్చగా మారింది. ఎంపీగా పోటీ చేసే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని, అది కూడా పెనమలూరు నుంచి పోటీ చేస్తానని పార్థసారథి తేల్చి చెప్పేసారు. దీంతో రెండు రోజులుగా పార్థసారధిని వైసీపీ హై కమాండ్ బుజ్జగించే పనిలో పడింది. మంగళవారం నాడు ఎంపీ సీటుకు సంబంధించి పార్థసారథి తో ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డి భేటీ అయ్యారు. మచిలీపట్నం ఎంపీ గానే పోటీ చేయాలంటూ పార్థసారధికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అయితే అందుకు ఎమ్మెల్యే పార్థసారథి అంగీకరించేందుకు ససేమీరా అంటున్నట్లు తెలుస్తోంది. పార్థసారథి కార్యాలయానికి అయోధ్య రామిరెడ్డి రాగా దాదాపుగా అరగంట పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. అయినప్పటికీ క్లారిటీ రాని పరిస్థితి. దీంతో పార్థసారథి కార్యాలయం నుంచి కొద్దిసేపటి క్రితం అయోధ్య రామిరెడ్డి వెళ్ళిపోయారు. సోమవారం జరిగిన చర్చల పట్ల పార్థసారథి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ అయోధ్య రామిరెడ్డి బుజ్జగించినప్పటికీ పార్థసారధి మెత్తబడని పరిస్థితి. సీనియర్ ఎమ్మెల్యే అయిన తన పట్ల వైసీపీ అధిష్టానం వ్యవహరించిన తీరుపై పార్థసారథి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో పార్థసారథి టీడీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
యాదవ సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి కూడా చేశారు. అయితే రానున్న శాసనసభ ఎన్నికలకు వైయస్సార్ సీపి పార్టీని మళ్లీ గెలిపించాలని సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంత్రులను, ఎమ్మెల్యేలను తొలగిస్తూ, ట్రాన్స్ ఫర్ చేస్తూ కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారధికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పగా, అందుకు పార్థసారథి ఒప్పుకోలేదు. ఎంపీ సీటు వద్దని ఎమ్మెల్యే సీటు కావాలని, అది కూడా పెనమలూరు నుంచి కావాలని పార్థసారథి పట్టుపట్టారు. ఇక ఆయనను బుజ్జగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా ఆయన తగ్గడం లేదు. దీంతో ఆయన టీడీపీలోకి చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.