YS Sharmila : కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల? ఆ పార్టీ నుంచి పోటీ.. షాక్‌లో జగన్?
ప్రధానాంశాలు:
ఏపీ కాంగ్రెస్ లో షర్మిలకు కీలక పదవి?
షర్మిలనే నమ్మకున్న కాంగ్రెస్ హైకమాండ్
కడప ఎంపీగా జగన్ కు పోటీగా షర్మిల బరిలోకి
YS Sharmila : వైఎస్ షర్మిల.. ఈ పేరు మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపించింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి ఆ పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారు. 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చెల్లెలును పట్టించుకోలేదు అనేది వాస్తవం. అందుకే తన తల్లి విజయమ్మ కూడా వైసీపీని వీడి తన కూతురు పెట్టిన వైఎస్సార్టీపీ పార్టీ చెంతకు చేరారు. కొన్నేళ్ల పాటు తెలంగాణలో రాజకీయాలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంతా భావించారు. వైఎస్సార్టీపీ పార్టీ తరుపున తను పాలేరులో పోటీ చేస్తారని.. తన తల్లి విజయమ్మ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. కానీ.. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి షర్మిల చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చివరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం షర్మిల యూటర్న్ తీసుకొని ఏపీ రాజకీయాల వైపు మళ్లినట్టు తెలుస్తోంది.
వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఏదో ఊరికే అడుగుపెట్టడం కాదు.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ లో తను కీలకంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించాలని హైకమాండ్ కోరినట్టు తెలుస్తోంది. ఇది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పుకోవాలి. వైఎస్సార్ మరణం తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ భూస్థాపితం అయింది. ఏపీలో నాశనం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ బతికించడం కోసం హైకమాండ్ ట్రై చేస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా తన చెల్లెలునే హైకమాండ్ దింపుతోంది.
YS Sharmila : కడప ఎంపీగా అన్నకు వ్యతిరేకంగా బరిలోకి
కడప లోక్ సభ స్థానం గురించి తెలుసు కదా. జగన్ అడ్డ అది. కానీ.. అక్కడే అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారట. ఎందుకంటే.. కడప ఎంపీ సీటులో ఆమె నిలబడితే.. కడప ప్రజలు అటు జగన్ కు మద్దతు ఇస్తారా? లేక వైఎస్సార్ కూతురు షర్మిలకు మద్దతు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే.