YS Sharmila : రాజన్న బిడ్డరా.. వైఎస్ షర్మిల ఏం చేసిందో తెలిస్తే.. వైఎస్ వీరాభిమానులు దండం పెట్టేస్తారు !
YS Sharmila : అది రాజన్న బిడ్డ అంటే. వైఎస్ షర్మిల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె కేవలం ఒక రాజన్న బిడ్డ లాగానే కాకుండా.. తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. ఆమె ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల్లో రాణిస్తున్నారు. నిజానికి ఏపీలో తన అన్న వైఎస్ జగన్ పార్టీని రూల్ చేస్తున్నారు. కానీ.. వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా అని ప్రామీస్ చేశారు.
ఇక.. రాజన్న కూతురుగా వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రజల కోసం పోరాడుతున్నారు. తాజాగా ఆమె రాజన్న బిడ్డ అని సగర్వంగా చెప్పుకునే పని చేశారు. ఏంటో తెలుసా? తాజాగా ఆమె ఇడుపులపాయకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇవాళ వైఎస్సార్ జయంతి. ఈసందర్భంగా వైఎస్సార్ ఫ్యామిలీ మొత్తం ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్ దగ్గరికి వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. షర్మిల, విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు.హైదరాబాద్ నుంచి కడపకు చేరుకున్న షర్మిల.. కడప విమానాశ్రయం నుంచి నేరుగా ఇడుపులపాయకు వెళ్లకుండా వేంలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాల భూమిని తన కొడుకు రాజారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు.
YS Sharmila : కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకున్న షర్మిల
అలాగే.. మరో ప్లేస్ లో ఉన్న 2.12 ఎకరాల భూమిని తన కూతురు అంజలి రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబం ఇడుపులపాయకు చేరుకుంది. ఆ తర్వాత వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు నివాళులు అర్పించిన అనంతరం హైదరాబాద్ వెళ్లిపోయారు. తన పేరు మీద ఉన్న ఆస్తిని తన కొడుకు, కూతురు పేరు మీదికి మార్చడంతో షర్మిలను రాజన్న బిడ్డ అంటే అలా ఉండాలి అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.