Ysrcp : వైసీపీ ఘర్ వాపసీ.. ఫలిస్తున్న మంత్రం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : వైసీపీ ఘర్ వాపసీ.. ఫలిస్తున్న మంత్రం..!

 Authored By aruna | The Telugu News | Updated on :23 February 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : వైసీపీ ఘర్ వాపసీ.. ఫలిస్తున్న మంత్రం..!

Ysrcp : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఘర్ వాపసీకి తెరతీసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తో మొదలైన ఇది వైసీపీలో జోరు అందుకుంటుంది అనే అంచనాలు ఉన్నాయి. ఘర్ వాపసీలో భాగంగా వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతుంది. గతంలో వైఎస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వాళ్ళని, వివిధ కారణాలతో బయటికి వెళ్లిన వారిని తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. గుంటూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల బాధ్యతలను ఆర్కే కు వైసీపీ అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అలాగే వంగవీటి రాధా తో కూడా వైసీపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది . ఇటు విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ తో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తో భేటీ అయ్యారు. టికెట్ ఇస్తే వైసీపీలోకి వస్తానని జలీల్ ఖాన్ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.

పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జలీల్ ఖాన్ తో అయోధ్య రామిరెడ్డి అన్నట్లు తెలుస్తుంది. అయితే ఘర్ వాపసీతో వైసీపీలోకి ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఫ్యామిలీతో కూడా వైసీపీ సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఘర్ వాపసీ ద్వారా వివిధ కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లిన వారిని తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇతర పార్టీలోకి వెళ్లినవారు అనుకూలంగా అక్కడ లేకపోవడంతో మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ఆశ చూపుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఘర్ వాపసీకి వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెళ్లిపోయిన నేతలను మళ్లీ నియోజకవర్గంలో చేర్చుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా వారితో మాట్లాడి చేరికలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీని వీడి వెళ్లిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీ తిరిగి పార్టీలోకి చేర్చుకుంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే సిద్ధం సభలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి సక్సెస్ అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కొత్త ఇన్చార్జిలను కూడా నియమించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలో నియోజకవర్గాల అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేకపోయారు. ఈ క్రమంలో వైసీపీ దూకుడుగా ప్రవర్తిస్తుంది. కొత్తగా ఘర్ వాపసీని తెరపైకి తీసుకువచ్చింది. గతంలో వైఎస్ కుటుంబానికి చెందిన నేతలు పార్టీని వీడి వెళ్లి వేరే పార్టీలోకి వెళ్లిన వాళ్లను ఈ ఘర్ వాపసీద్వారా మళ్లీ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపి మళ్లీ వైసీపీలోకి తీసుకువచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది