NDTV Survey : ఏపీలో గెలుపేవ‌రిదో తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

NDTV Survey : ఏపీలో గెలుపేవ‌రిదో తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే..!

NDTV survey : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే అటు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాంతో ఎవరికి వారే పార్టీలు ప్రచార హోను కొనసాగిస్తున్నాయి. అటు వైసీపీ కచ్చితంగా మరోసారి అధికారం తమదే అని చెబుతోంది. కానీ కూటమి మాత్రం ఈ సారి జగన్ ఓడిపోతాడని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలానే సర్వే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇలా నిర్వహించిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2024,3:26 pm

NDTV survey : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే అటు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాంతో ఎవరికి వారే పార్టీలు ప్రచార హోను కొనసాగిస్తున్నాయి. అటు వైసీపీ కచ్చితంగా మరోసారి అధికారం తమదే అని చెబుతోంది. కానీ కూటమి మాత్రం ఈ సారి జగన్ ఓడిపోతాడని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలానే సర్వే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇలా నిర్వహించిన సర్వేల్లో చాలా వరకు వైసీపీ గెలుస్తుందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్డీటీవీ కూడా ఇదే విషయాన్ని తెలిపింది.

NDTV Survey ఏపీలో గెలుపేవ‌రిదో తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే

NDTV Survey : ఏపీలో గెలుపేవ‌రిదో తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే..!

NDTV survey : రాష్ట్రమంతా వైసీపీ గాలి…

ఎన్డీటీవీ అంటే దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ప్రముఖ టీవీ ఛానెల్ గా ఉన్న దానికి ఇప్పుడు సర్వే ఫలితాలు కూడా క్రేజ్ ను పెంచుతున్నాయి. ఎందుకంటే ఎన్డీటీవీ చేసిన సర్వేలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో తాజాగా ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో మరోసారి ఫ్యాన్ గాలి తిరగబోతోందని తెలిపింది సర్వే. టీడీపీ- బీజేపీ – జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీచేసినా విజయం జగన్ నే వరించనుందని వెల్లడించింది. అటు లోక్ సభ సీట్లలోనూ వైసీపీ గాలి వీస్తుందని తేల్చేస్తుంది.

112 సీట్లతో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని సర్వే స్పష్టం చేసింది. అంతే కాకుండా అటు ఎంపీ సీట్లలో కూడా దాదాపు 16 స్థానాలు గెలుచుకుంటుందని వివరించింది ఈ సర్వే. ఇక కూటమికి కేవలం 60 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వస్తాయని.. అంతకు మించి వచ్చే అవకాశాలు లేవని తెలిపింది ఈ సర్వే. ఇక 9 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వివరించింది. అటు కాంగ్రెస్ కూటమికి ఈ సర్వే పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవదని తేల్చేసింది. కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు రాదని, ఒక ఎంపీ సీటు రాదని స్పష్టం చేసింది.

NDTV Survey ఏపీలో గెలుపేవ‌రిదో తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే

NDTV Survey : ఏపీలో గెలుపేవ‌రిదో తేల్చేసిన ఎన్డీటీవీ సర్వే..!

జగన్ గెలుపులో ఎక్కువగా సంక్షేమ పథకాలే ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతోంది సర్వే. అటు వైసీపీ ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని చెబుతోంది. అందుకే ఈ సారి వైసీపీ జెండా ఎగురుతుందని వైసీపీ పదే పదే వివరిస్తోంది. చూడాలి మరి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది