YSRCP : త్వరలో జగన్ మేనిఫెస్టో విడుదల… ఆ వర్గాల వారికి బంపర్ పథకం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YSRCP : త్వరలో జగన్ మేనిఫెస్టో విడుదల… ఆ వర్గాల వారికి బంపర్ పథకం…!

 Authored By aruna | The Telugu News | Updated on :15 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  YSRCP : త్వరలో జగన్ మేనిఫెస్టో విడుదల...ఆ వర్గాల వారికి బంపర్ పథకం...!

YSRCP : ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టినటువంటి సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో ఈనెల 18న ఆఖరి సభతో ముగించాలని వైసీపీ పార్టీ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ముగింపు సభ కోసం అనంతపూర్ లో భారీగానే ప్లాన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరి సభలో ఎన్నికలకు సంబంధించిన తన మేనిఫెస్టోను విడుదల చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో నవరత్నాలు అనే కాన్సెప్ట్ తో 2019లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి నవరత్నాలు ఎలాగైతే ఉపయోగపడ్డాయో ,ఇక ఇప్పుడు విడుదల చేసే మేనిఫెస్టోలో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ హామీ లు ప్రజల కోసం తాను చేసేవి, కొత్తవి తీసుకురావాలి అనే అంశాలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు ప్రకటించబోతున్నారని సమాచారం. అయితే జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది…?దానివలన ప్రతిపక్ష పార్టీలకు దెబ్బ తగులుతుందా…? అనే చర్చలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే…

మేనిఫెస్టో తో ప్రతిపక్ష పార్టీలకు కచ్చితంగా దెబ్బ తగులుతుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ మేనిఫెస్టోలో మధ్యతరగతి పేద అలాగే మహిళలకు ప్రాధాన్యత ఉండబోతుందని అదేవిధంగా బీసీలకు ఇప్పటికి మించి వరాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీల పై కూడా హామీ ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2019లో ప్రకటించిన నవరత్నాల కు మించి 2024 ఎన్నికలు మేనిఫెస్టో లో హామీలు ఉండబోతున్నట్లుగా పార్టీ వర్గాల నుండి సమాచారం. ఇక జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో పోల్చి చూడడం మొదలవుతుందని అంటున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే చంద్రబాబు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను తర్వాత నెరవేర్చడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్లుగా హామీలను ఇస్తున్నారని చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్నా. అయితే జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి.. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇద్దరి నాయకుల పైన ఒకే విధమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు కేవలం వారు అధికారంలోకి రావడానికి మాత్రమే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే వారు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చే హామీలు కొన్ని రాష్ట్రాన్ని దివాళా తీపించే దిశగా ఉంటాయని అందుకే వాటిలో కొన్ని ఎప్పటికీ జరగనివి కూడా మేనిఫెస్టోలో విడుదల చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. అంటే కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే వారు అలాంటి హామీలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ తీసుకురాబోయి మేనిఫెస్టోలో ఎవరు ఊహించని హామీ ఒకటి ఉందని అంటున్నారు. అదే రైతు రుణమాఫీ. అయితే ఈ రైతు రుణమాఫీ ఎంతవరకు చేస్తామనేది కచ్చితంగా చెప్పి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2014లో రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని చేయలేదని ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే చేస్తాడు అని తన పార్టీ తరఫు నుంచి ఏవైతే మాటలు వినిపిస్తున్నాయో వాటిని నెరవేర్చి దిశగా ఈనెల 18న ముగిసే సిద్ధం సభలో జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తూనే దానిలో రైతు రుణమాఫీని హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏవైతే రైతు కుటుంబాలు ఉన్నాయో వారి ఓట్లను తన వైపు లాక్కునే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది