Business Ideas : అర ఎకరంలో పుదీనా సాగు చేయండి.. నెలకు రూ.80 వేలు ఎటూపోవు.. ఇలా చేస్తే చాలు
Business Ideas : పుదీనా సాగు గురించి తెలిసిందే కానీ.. దాన్ని ఎలా సాగు చేయాలో సరైన పద్ధతులు నేర్చుకుంటే లక్షలు గడించవచ్చు. ఎందుకంటే.. పుదీనా లేకుండా కూర వండరు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల్లో పుదీనాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. చికెన్, మటన్ కూరల్లో.. బిర్యానీ వంటకాల్లో ఖచ్చితంగా పుదీనా ఉండాల్సిందే. అలాగే పుదీనాతో పచ్చడి కూడా చేస్తారు. అలా పుదీనాకు సంవత్సరం మొత్తం మార్కెట్ ఉంటుంది. అందుకే.. వ్యవసాయ భూమి ఉన్నవాళ్లు కేవలం అరఎకరంలో పుదీనా సాగు చేసి లక్షలు సంపాదించుకోవచ్చు.
ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. 5 నుంచి 6 ఏళ్ల పాటు దిగుబడి సాధించవచ్చు.దాని కోసం భూమిని బాగా సారవంతంగా చేసుకోవాలి. ముందు పశువుల ఎరువు పోసి కనీసం 15 రోజులు అలాగే మగ్గపెట్టాలి. డీఏపీ కూడా చల్లాలి. ఆ తర్వాత పుదీనా కాండాలను తీసుకొని నాటాలి. ఒక వారం ఆగాక.. కాండాలు చిగురిస్తాయి. కేవలం నెల రోజులు ఆగితే చాలు దిగుబడి స్టార్ట్ అవవుతుంది. అలా ఐదారేళ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది.
Business Ideas : నీటి సాగు ఎలా?
పుదీనా సాగు కోసం నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు. భూమిలో స్ప్రింకర్లు అమరిస్తే చాలు. మూడు రోజులకు ఒకసారి కాసేపు నీరు పెడితే చాలు. అర ఎకరంలో పుదీనా సాగు కోసం 20 వేల రూపాయల పెట్టుబడి పెడితే చాలు. ఒక కట్టకు మార్కెట్లో రూ.10 పలుకుతుంది. అంటే ఒక 5 గుంటల భూమిలో 2 వేల కట్టల వరకు దిగుబడి సాధించవచ్చు. అంటే.. 2 వేలు అంటే 20 వేల రూపాయలు. అదే అరెకరంలో అయితే.. రూ.80 వేల వరకు నెలకు ఆదాయం పొందొచ్చు.