Business Idea : కార్ పై బంపర్ ఆఫర్లు… కొనాలనుకునే వారికి ఈజీగా లోన్… రూ.45 వేల తగ్గింపు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : కార్ పై బంపర్ ఆఫర్లు… కొనాలనుకునే వారికి ఈజీగా లోన్… రూ.45 వేల తగ్గింపు…

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,9:30 pm

Business Idea : కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ కంపెనీ ఒక శుభవార్త చెప్పింది. టాటా మోటార్స్ కంపెనీ కారు కొనాలని అనుకునే వారికి సులువుగా రుణాలు లభించే అవకాశం వచ్చింది. తాజాగా ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కారు కొనాలనుకునే వారికి సులువుగా ఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. కార్ కస్టమర్లకు ఆకర్షణీయ వడ్డీ రేటు తో కష్టమైజ్డ్ కార్ లోన్స్ అందించాలనే ఉద్దేశంతో ఇండియన్ బ్యాంక్, టాటా మోటార్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కస్టమర్లు కార్ లోన్ కోసం బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. అలాగే రుణానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

బ్యాంకు కి వెళ్లకుండా టాటా మోటార్స్ షోరూమ్స్ లో కూడా లోన్స్ సౌకర్యం పొందవచ్చు. టాటా మోటార్స్ డీలర్స్ కస్టమర్లకు కల్పించే ఫైనాన్స్ ఆప్షన్లలో ఇండియన్ బ్యాంకు కూడా ఉంది. దీనివలన కస్టమర్లకు సులభంగా కారు రుణాలు అందుతాయి. కస్టమర్లకు సులభంగా కారు రుణాలు అందించాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమ్రాన్ అమీన్ సిద్ధిక్ తెలిపారు. అలాగే వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కార్ కొనాలనుకునేవారు కష్టమైజ్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు అని కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ రమేష్ దొరైరాజన్ తెలిపారు.

Business Idea for cars tata motors partners with Indian bank

Business Idea for cars tata motors partners with Indian bank

అలాగే కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ కారుపై భారీ తగ్గింపు లభిస్తుంది. టాటా టియాగో కారుపై రూ.25 వేల వరకు తగ్గింపు ఉంది. అలాగే టాటా టిగోర్ కారుపై ఇదే మొత్తంలో తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. టాటా నెక్సన్ కారుపై రూ.20 వేల వరకు తగ్గింపు ఉంది. టాటా హరియర్ పై రూ.45 వేల తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు. టాటా సఫారీ పై కూడా ఇలాంటి డిస్కౌంట్ ఉంది. కాగా కారు తగ్గింపు పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి కలిపి ఉంటాయి. ఎవరైనా కారు కొనాలనుకుంటే ముందే ఈ వివరాలను తెలుసుకొని కొనాలి అని అన్నారు. అలాగే షోరూం రూల్స్ ప్రకారం ఎప్పుడైనా సరే ఆఫర్లలో మార్పు రావచ్చు అని తెలిపారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది