Business Idea : ఎక్కడ పెద్దగా గుర్తింపు లేని బిజినెస్ ఇది… కానీ లక్షల్లో ఆదాయం… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఎక్కడ పెద్దగా గుర్తింపు లేని బిజినెస్ ఇది… కానీ లక్షల్లో ఆదాయం…

 Authored By aruna | The Telugu News | Updated on :5 September 2022,6:30 am

Business Idea : ప్రస్తుతం కరోనా వచ్చాక ప్రజలంతా పరిశుభ్రతపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు పరిశుభ్రత కోసం ఎంత ఖర్చైనా పెట్టగలుగుతున్నారు. అయితే దానికి సంబంధించిన బిజినెస్ ఒకటి ఉంది. సాధారణంగా హాస్పిటల్స్, హోటల్స్, కార్పొరేట్ ఆసుపత్రులకు నిరంతరం హ్యాండ్ వాష్ సొల్యూషన్, టాయిలెట్ వాష్ సొల్యూషన్, ఫినాయిల్, శానిటైజర్ వంటివి ఎక్కువగా అవసరం పడుతుంటాయి. వారు దీన్ని రిటైల్ మార్కెట్లో కొనుగోలు చేసి మెయింటైన్ చేయడం పెద్ద ఖర్చుతోను, టైం వేస్ట్ తో కూడిన పని. దీన్ని మీరు అవకాశంగా మార్చుకోవచ్చు. హ్యాండ్ వాష్, ఆంటిసెప్టిక్ లిక్విడ్, ఫినాయిల్, టాయిలెట్ వాష్ వంటివి డోర్ డెలివరీ చేయగలిగితే మీకు మంచి వ్యాపారంగా దొరుకుతుంది. ఉదాహరణకు హాస్పిటల్స్ లో డాక్టర్స్, నర్స్ లు ఇతర సిబ్బందికి హ్యాండ్ వాష్ శానిటైజర్, క్లీనింగ్ సొల్యూషన్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. వారు ప్రతిరోజు లీటర్ల కొద్ది వాడుతుంటారు. ఆ సొల్యూషన్స్ అయిపోయిన ప్రతిసారి కొనుగోలు చేయడం వారికి కష్టం.

అందుకే మీరు హాస్పిటల్, హోటల్స్, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉపయోగించే క్లినిక్ సొల్యూషన్ బల్క్ గా కొనుగోలు చేసే వారికి రెగ్యులర్ గా సప్లై చేస్తే సరిపోతుంది. అందుకు మీరు ఒక కంటైనర్ ఆటో పెట్టుకుంటే సరిపోతుంది. ముందుగా బల్క్ గా హాస్పిటల్స్, హోటల్స్, ఆఫీసుల్లో విరివిగా ఉపయోగించే హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ శానిటైజర్, నాప్కిన్స్ వంటి వివరాలు తెలుసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల వద్ద కొనుగోలు చేయాలి. ఒక గోడౌన్ పెట్టుకొని అందులో సరుకు ఉంచుకోవాలి. తర్వాత నెమ్మదిగా మీ ప్రదేశంలో ఆసుపత్రుల వివరాలు సేకరించి వాటికి మీ సర్వీసును పరిచయం చేయాలి. అలాగే వారు ప్రతిరోజూ ఆయా క్లీనింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేసేందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు. వారికి ఎంత తక్కువకు ఇస్తారో వివరించాలి. అప్పుడు కస్టమర్లు లభిస్తారు.

Business Idea Full demand business income in lakhs per monthly

Business Idea Full demand business income in lakhs per monthly

ఒకసారి కస్టమర్ నెట్వర్క్ తయారు అయ్యాక వారికి సర్వీస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. ఇక ఈ బిజినెస్ చేయడానికి కావాల్సిందే ఒక కంటైనర్ ఆటో, ఒకరు లేదా ఇద్దరు సహాయకులు సరుకు దాచుకునేందుకు ఉంటే సరిపోతుంది. సాధారణంగా ఒక టాయిలెట్ క్లీనర్ లిక్విడ్ లీటర్ ధర మార్కెట్లో 150 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు బల్క్ గా కొనుగోలు చేస్తే 50 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. వారికి మరో 50 రూపాయల లాభంతో విక్రయించిన కస్టమర్కు 50 రూపాయల లాభం వస్తుంది. అదేవిధంగా మీకు లాభం వస్తుంది. సర్వీస్ ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్ కరెంట్ అకౌంట్ ఖాతా తీసుకోవాలి. అలాగే జీఎస్టీ నెంబర్ తీసుకోవాలి. అన్ని అనుమతులు పొందినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్, ఆఫీసులు ఇతర పెద్ద సంస్థల నుంచి మన ఆర్డర్స్ పొందగలమని గుర్తుపెట్టుకోవాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది