Business Idea : మీకు తెలుసా…కడక్నాథ్ కోళ్ల పెంపకంతో కేవలం రూ.50,000 పెట్టుబడితో… లక్షల్లో ఆదాయం పొందవచ్చు…
Business Idea : నిజానికి ఆహారానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ప్రజలు కష్టపడేదే ఆహారం కోసం. ఇక మన దేశంలో పౌల్ట్రీ రంగం కూడా గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాన్నిచ్చే చక్కటి వనరు. ఈ రంగంలో చాలామంది కోటీశ్వరులు అయ్యారు. ప్లానింగ్, నిర్వహణ, మార్కెటింగ్ సరిగ్గా చేసుకుంటే పౌల్ట్రీ కి ఎప్పుడు డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కడక్నాథ్ కోళ్లు వాటి గుడ్లు, మాంసం ఇతర చికెన్ల కంటే చాలా ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. కడకనాథ్ కోళ్లు పూర్తిగా నల్లగా ఉంటాయి. వీటి మాంసం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే మార్కెట్లో గిరాకీ ఎక్కువ ఉంటుంది. దీని ధర కూడా ఎక్కువే. ఈ కోళ్లు మధ్యప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి.
మధ్యప్రదేశ్ లోని జుబువాలోని కడకనాథ్ కోడిని వాళ్ల భాషలో కలిమాసి అంటారు. ఇది భారతీయ జాతి కోడి. ఇవి ఈకల నుండి చర్మం దాకా పూర్తిగా నల్లగా ఉంటాయి. దీని గుడ్లు, మాంసం కూడా నలుపు రంగులో ఉంటాయి. కేజీ 600 నుంచి 900 వరకు అమ్ముతుంటారు. ఈ కోడిగుడ్ల కనీసం 40 రూపాయలకు అమ్ముడు పోతుంది. కడకనాథ్ చికెన్ లో కొవ్వు తక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. గుండె, డయాబెటిస్ రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. దీని మాంసం, గుడ్డు తినడం వలన పురుషులలో లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. కడక్నాథ్ కోడి పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సెంట్రల్ పౌల్ట్రీ ఇన్స్టిట్యూట్ చండీగఢ్లోని పంత్ నగర్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కోళ్లను ఇంట్లో కూడా పెంచవచ్చు. చిన్న స్థాయిలో కూడా దాని వ్యాపారం చేయడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. కడకనాథ్ చికెన్ తింటే ఉబ్బసం, క్షయ, మైగ్రేన్ వంటి వ్యాధులు నయమవుతాయి. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ.
కడక్నాథ్ కోళ్ల పెంపకం ప్రారంభించడానికి 50 వేల పెట్టుబడి అవుతుంది. ఈ వ్యాపారాన్ని 100 లేదా 200 కోడి పిల్లలతో కూడా మొదలు పెట్టవచ్చు. ఇతర కోళ్లకు లాగా రోగాలు రావు. దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు. కోళ్ల షెడ్డులో కరెంటు, నీళ్లతో పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలి. కడకనాథ్ చికెన్ కిలో మాంసం తయారు చేసేందుకు దాదాపు 200 ఖర్చు అవుతుండగా 600 నుంచి 900 వరకు అమ్మవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బరేలీలో ఇండియన్ బర్డ్ రీసెర్చ్ సెంటర్ నుండి శిక్షణ తీసుకోవచ్చు. ఇతర కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా శిక్షణ ఇస్తారు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పూర్తి సమాచారాన్ని ఆయా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖ నుండి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని పశుసంవర్ధక శాఖ ఈ కడక్నాథ్ కోళ్ల పెంపకం కోసం సమాచారాన్ని రైతులకు అందిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు చిన్న మొత్తంలో కడక్నాథ్ కోళ్లను పెంచవచ్చు.