Business Ieda : మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న వ్యాపారం ఇదే .. అన్నీ పోను 3 లక్షల ఆదాయం …!
Business Ieda : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే వ్యవసాయం ద్వారా కూడా మంచి లాభాలను పొందవచ్చు. సాంప్రదాయ వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం ఆయుర్వేద మందులలో, అలోపతి మందులలో ఎన్నో ఔషధ మొక్కలను వాడుతున్నారు. ఆ మొక్కలను పండిస్తే భారీగా ఆదాయం పొందవచ్చు. అలాగే మార్కెటింగ్ ఇబ్బందులు కూడా ఉండవు. ఔషధ మొక్కల సాగుకు ఎక్కువగా ప్లేస్ అవసరం లేదు. పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. పలు ఔషధ కంపెనీలతో ఒప్పందం చేసుకొని పంటను సాగు చేయాలి.
ప్రస్తుతం చాలా కంపెనీలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. వాటి సాగుకు వేలల్లో పెట్టుబడి పెడితే చాలు, ఆదాయం లక్షల్లో వస్తుంది. ఆర్టెమిసియా, తులసి, అన్నూ, లికోరైస్, అలోవెరా మొక్కలను చాలా రకాల ఔషధాల్లో వాడుతున్నారు. ఈ మొక్కలను పెంచితే మంచి ఆదాయం పొందవచ్చు. తక్కువ టైంలోనే పంట చేతికి వస్తుంది. హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. స్ర్తీలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి తులసినీ పూజిస్తారు. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసిలో యూజినాల్ మరియు
మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. అందుకే తులసి మొక్కలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. 1 హెక్టారులో తులసిని సాగు చేయడానికి కేవలం 15 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే 3 నెలల తర్వాత ఈ పంట ద్వారా మూడు లక్షల ఆదాయం పొందవచ్చు. పతాంజలి, డాబర్, వైద్యనాథ్ వంటి ఆయుర్వేద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని వ్యవసాయం చేయవచ్చు. కంపెనీ నే విత్తనాలను ఇస్తుంది. రైతులు సాగు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెటింగ్ రిస్కు కూడా ఉండదు.