Business Ideas : వేల రూపాయల పెట్టుబడితో లక్షల్లో లాభాలు.. ఇంకెందుకు ఆలస్యం ఈ పంట పండించండి.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Ideas : వేల రూపాయల పెట్టుబడితో లక్షల్లో లాభాలు.. ఇంకెందుకు ఆలస్యం ఈ పంట పండించండి..

 Authored By mallesh | The Telugu News | Updated on :14 January 2022,9:30 am

Business Ideas : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు సంప్రదాయ పంటలనే పండిస్తుండటం మనం చూడొచ్చు. వాణిజ్య పంటలతో పాటు సంప్రదాయ పంటలపైన వారు ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. మొక్కజొన్న, పత్తి, వరి, వేరుశనగతో పాటు ఇతర కూరగాయలు పండిస్తుంటారు. అయితే, ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి మద్దతు ధర లభించక చాలా నష్టపడుతుంటారు. కాగా, ఈ రకం పంటలు వేస్తే కనుక వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి పంటలను రైతులు పండించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’లో సూచించారు. అటువంటి లాభదాయక పంటల గురించి తెలుసుకుందాం.

ప్రధాని ప్రస్తావించిన లాభయదాయక పంటల్లో ఒకటి లెమన్ గ్రాస్.. అనగా నిమ్మ గడ్డి.. ఈ నిమ్మగడ్డి నుంచి తీసినటువంటి ఆయిల్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఫేసియల్ ప్రొడక్ట్స్, సోప్స్ తయారీలో ఈ ఆయిల్ ఉపయోగిస్తారు. ఇకపోతే ఈ గడ్డి అన్ని రకాల భూముల్లో పండుతుంది. ఇది పండించడానికి వాటర్ కూడా పెద్దగా అవసరం లేదు. ఈ నిమ్మగడ్డి పంటకు ఎరువులు కూడా పెద్దగా అవసరం లేదు. దీనికి పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే కనుక లక్షల రూపాయల్లో ఆదాయం వస్తుందని రైతులు కొందరు చెప్తున్నారు.

business ideas you invest money in thousands for this crop you lakshs of rupees

business ideas you invest money in thousands for this crop you lakshs of rupees

Business Ideas : ఈ పంటలకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్..

ఈ నిమ్మగడ్డి విత్తనాలను ఫిబ్రవరి నుంచి జూలై మధ్యలో నాటాలి. ఒక ఎకరాకు రెండు కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయని రైతులు చెప్తున్నారు. ఈ విత్తనాలను ఒక్కసారి నాటితే దాదాపు నాలుగేళ్ల వరకు పంట వస్తుండటం విశేషం. ఇకపోతే ఈ గడ్డిని నాటిన మూడు నుంచి నాలుగు నెలల్లోనే కోసేయాలి. అలా పంట కూడా వెంటనే వస్తుండటం గమనార్హం. ఇకపోతే గడ్డి నుంచి వచ్చే సువాసన కూడా బాగుంటుంది. ఇకపోతే ఈ గడ్డి నుంచి తీసిన నూనెకు ఒక లీటర్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉండటం విశేషం. ఎకరం భూమికి మార్కెట్ లో రేటును బట్టి సుమారు రూ. 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది