Business Idea : రోడ్డు మీద సోడా అమ్ముతూ బతికేవాళ్లు.. ఇప్పుడు 650 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.. ఎలా సాధ్యమైంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : రోడ్డు మీద సోడా అమ్ముతూ బతికేవాళ్లు.. ఇప్పుడు 650 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించారు.. ఎలా సాధ్యమైంది?

Business Idea : వాడిలాల్.. స్వాతంత్రానికి ముందు 1907లో గుజరాత్‌లో ప్రారంభించిన బ్రాండ్‌. అద్భుతమైన టేస్టు తో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రసిద్ధి చెందిన ఫేమస్‌ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తోంది. కానీ ప్రారంభించిన రంగం వేరు ఇప్పుడు రాణిస్తున్న రంగం వేరు. 1907 లో సోడా అమ్మేందుకు వాడిలాల్‌ను ప్రారంభించి.. క్రమంగా ఐస్‌ క్రీమ్‌ వైపు మళ్లించారు. ప్రస్తుతం 200 రకాల ఐస్‌ క్రీములను అందిస్తోంది వాడిలాల్‌. వాడిలాల్ 1926లో తన మొదటి ఐస్ క్రీం […]

 Authored By jyothi | The Telugu News | Updated on :8 February 2022,9:00 am

Business Idea : వాడిలాల్.. స్వాతంత్రానికి ముందు 1907లో గుజరాత్‌లో ప్రారంభించిన బ్రాండ్‌. అద్భుతమైన టేస్టు తో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రసిద్ధి చెందిన ఫేమస్‌ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తోంది. కానీ ప్రారంభించిన రంగం వేరు ఇప్పుడు రాణిస్తున్న రంగం వేరు. 1907 లో సోడా అమ్మేందుకు వాడిలాల్‌ను ప్రారంభించి.. క్రమంగా ఐస్‌ క్రీమ్‌ వైపు మళ్లించారు. ప్రస్తుతం 200 రకాల ఐస్‌ క్రీములను అందిస్తోంది వాడిలాల్‌. వాడిలాల్ 1926లో తన మొదటి ఐస్ క్రీం అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. అదే సంవత్సరంలో మొదటిసారిగా, జర్మనీ నుండి ఐస్‌క్రీం తయారీ యంత్రాన్ని దిగుమతి చేసుకున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికి, వాడిలాల్‌ సంస్థ అహ్మదాబాద్ అంతటా నాలుగు ఔట్‌ లెట్లను తెరిచింది.

70వ దశకం నాటికి ఔట్ లెట్ల సంఖ్య 10 కి చేరింది. వాడిలాల్ తన కస్టమర్‌లతో ఎల్లప్పుడూ మంచి కమ్యూనికేషన్‌ ఏర్పరచుకుంది. వారి సలహాలు, సూచనలు జోడిస్తూ.. తమ ఐస్‌ క్రీమ్‌లను వారు ఇష్టపడేలా తయారు చేయడం ప్రారంభించారు. ఐస్‌ క్రీమ్ తయారీలో కొంత ఎగ్‌ కలుపుతారని అనుకుంటుంటారు. దానినీ వాడిలాల్‌ తమ అభివృద్ధికి ఉపయోగించుకుంది. అది ఎలాగంటే.. తమ ఐస్ క్రీమ్‌లు 100 శాతం శాఖాహారమైనవని.. మతపరమైన కార్యక్రమాల్లో ఉపవాస సమయాల్లోనూ తమ ఐస్‌ క్రీమ్‌లను తినొచ్చని వాడిలాల్‌ ప్రచారం చేసుకుంది. క్రమంగా వాడిలాల్‌ బ్రాండ్‌ పెరుగుతూ వచ్చింది. 1990లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయింది. అదే సంవత్సరంలోకుటుంబ కలహాల వల్ల కంపెనీలో చీలికలు వచ్చాయి.

century old vadilal ice cream brand first to launch dollies cones

century old vadilal ice cream brand first to launch dollies cones

అయినా వాడిలాల్‌ వృద్ధి సాధిస్తూనే వచ్చింది. 90వ దశకం ప్రారంభంలో, వాడిలాల్‌ కంపెనీ ప్రాసెస్డ్ ఫుడ్ రంగంలోకి ప్రవేశించింది. వాడిలాల్ క్విక్ ట్రీట్‌ను ప్రారంభించి… 1995లో, అమెరికాకు కూరగాయలను ఎగుమతి చేసింది. ప్రస్తుతం వాడిలాల్‌.. యూ.ఎస్‌ లో అత్యధికంగా అమ్ముడవుతున్న భారతీయ ఐస్ క్రీం బ్రాండ్‌గా కొనసాగుతోంది. కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని 45 దేశాలకు వాడిలాల్‌ ఐస్‌ క్రీమ్ సప్లై అవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 650 కోట్ల ఆదాయాన్ని సాధించింది వాడిలాల్‌. వ్యాపారాన్ని నైతికంగా నిర్వహించడం బ్రాండ్‌ నేమ్ పెరిగేందుకు చాలా ముఖ్యమైని కంపెనీ నిర్వాహకులు చెబుతున్నారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది