Business idea : రూ.2000 పెట్టుబడి పెట్టి హోమ్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించిన మహిళ
Business idea : కుటుంబం కష్టాల్లో ఉంటే ఏ మహిళ కూడా చూస్తూ ఊరుకోదు. తనవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తుంది. తన వల్ల సాధ్యమైన ఏ చిన్న పని అయినా చేసి కుటుంబం నిలుదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుంది. మహారాష్ట్రలోని థానేకు చెందిన లలితా పాటిల్ భర్త గ్యాస్ ఏజెన్సీని నడిపే వాడు. వారిది ఒక మధ్యతరగతి కుటుంబం. సాధారణ జీవనశైలితో బతికేవారు. గ్యాస్ ఏజెన్సీతో వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించే వారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ పైప్ లైన్ లు వేయడంతో లలితా పాటిల్ భర్త వ్యాపారం నష్టాలు ఎదుర్కొంది. వ్యాపార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడూ ఒక బిజినెస్ పెట్టి స్వతంత్రంగా జీవించాలనుకునే లలితా పాటిల్ కుటుంబాన్ని తన బాధ్యతగా భావించింది.ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన లలిత ఎప్పుడూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది.
మొదట్లో బతుకుదెరువు కోసం ట్యూషన్లు చెప్పి, తర్వాత ఫార్మసీ కంపెనీకి మందులు అమ్మింది. కానీ ఆమె పని ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు.అందుకే 2016లో టిఫిన్ బాక్సుల కొనుగోలుకు రూ.2000, ప్రకటనల కోసం కరపత్రాలు పంచేందుకు మరో రూ.500 పెట్టుబడి పెట్టింది. దీంతో ఇంట్లో టిఫిన్ వ్యాపారం ప్రారంభించింది. వంటపైన తనకున్న ఇష్టాన్నే వ్యాపారం మలచుకోవాలని భావించింది.లలిత ఫుడ్ బిజినెస్ లైసెన్స్‌ని పొందింది. అలాగే ఇంట్లో తయారుచేసిన సాధారణ ఆహారాన్ని అందించడానికి తన టిఫిన్ సేవలకు ఘరాచీ అథవన్ లేదా ‘మెమొరీస్ ఆఫ్ హోమ్’ అని పేరు పెట్టింది. ఏడాది పాటు అంతా బాగానే సాగింది. వ్యాపారం కూడా మంచి లాభాలనే తెచ్చి పెడుతోంది. కానీ తనను ఇంకా అందరూ ఒక గృహిణిగానే చూస్తున్నారని గ్రహించింది లలితా. ఇంటి నుండి వ్యాపారాన్ని నడుపుతున్నందున, ప్రజలు నన్ను వ్యాపారవేత్తగా పరిగణించలేదు.

homemaker turns entrepreneur with homemade food business worth crores thane
గౌరవం సంపాదించాలంటే తన ఇంటి నాలుగు గోడల వెలుపల వ్యాపారం చేయాల్సిందేనని నిర్ణయించుకుంది. కానీ ఆమెకు పెట్టుబడి పెట్టడానికి మూలధనం లేదు.2019లో ఒకరోజు, ఆమె బ్రిటానియా మేరీ గోల్డ్ మై స్టార్ట్-అప్ పోటీకి సంబంధించిన ప్రకటనను చూసింది లలితా. అది వ్యవస్థాపక ప్రయాణాలలో మహిళలకు మద్దతునిస్తుందని లలితా అనుకుంది. పది మంది విజేతలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు కూడా ఆ ప్రకటనలో ఆఫర్ చేశారని గుర్త చేసింది. అవకాశాన్ని అందిపుచ్చుకుని లలిత పోటీకి దిగి విజయం సాధించింది. పన్ను మినహాయింపుల తర్వాత లలితా రూ.7 లక్షలు అందుకుంది. రెస్టారెంట్‌లో రూ. 6 లక్షలు పెట్టుబడి పెట్టింది.
చాలా కష్టాల తర్వాత, థానే రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న టీజేఎస్బీ బ్యాంక్ సమీపంలోని కోప్రి రోడ్‌లో తగిన స్థలాన్ని కనుగొంది.ఇంటికి దూరంగా ఉండే వారినే మొదట లక్ష్యం చేసుకుంది లలితా. విద్యార్థులను, ఉద్యోగాలు చేసే వారు తన దగ్గరికి రావడం మొదలు పెట్టారు. చూస్తుండగానే లలితా వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా లభాలు గడించింది. ఇక అప్పటి నుంచి లలిత వెనుదిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం రూ. కోటి వార్షిక ఆదాయం అందుకుంటోంది. నెలకు కనీసం రూ.6-7 లక్షల వ్యాపారం సంపాదిస్తోంది. తన భర్త తన వ్యాపారాన్ని వదిలేసి లలితా చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. అలాగే 10 మందికి ఉపాధి అందిస్తోంది.