Loans : మీకు లోన్స్ కావాలా… తక్కువ వడ్డీ రేటుతో సులభంగా లోన్ పొందే అవకాశం..!
ప్రధానాంశాలు:
Loans : మీకు లోన్స్ కావాలా... తక్కువ వడ్డీ రేటుతో సులభంగా లోన్ పొందే అవకాశం..!
Loans : ఈ రోజుల్లో చాలా మంది కూడా లోన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సిబిల్ స్కోర్ CIBIL score తక్కువగా ఉందా? లోన్ రాదని బాధపడుతున్నారా? ఇక బాధపడకండి. నేటి డిజిటల్ యుగంలో, క్రెడిట్ స్కోర్లతో సంబంధం లేకుండా, అనేక యాప్స్ స్మార్ట్‌ఫోన్ నుంచే ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. ఒకప్పుడు బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు వేలిముద్రతోనే లోన్ అందుకునే అవకాశం ఉంది. PhonePe , గూగుల్ పే, పేటీఎం, నవీ లోన్ యాప్, మనీ వ్యూ లోన్ యాప్ ద్వారా సులువుగా లోన్ పొందే అవకాశం ఉంది. అయితే ఈ యాప్‌ల ద్వారా చాలా సులభంగా పర్సనల్ లోన్ లేదా పర్సనల్ లోన్ పొందవచ్చు…
Loans లోన్ కోసం..
ఈ యాప్‌ల ద్వారా మీరు లోన్ పొందాలనుకుంటే, ఈ యాప్‌లన్నీ పర్సనల్ లోన్ వడ్డీ రేటును సంవత్సరానికి 10.95% నుండి సంవత్సరానికి గరిష్టంగా 31% వరకు వసూలు చేస్తాయి. కాబట్టి మీరు లోన్ పొందే ముందు, అందించే వ్యక్తిగత రుణాన్నిఒకసారి తనిఖీ చేయాలి. ఆ సంస్థలు లేదా ఆ యాప్‌లు వడ్డీ రేటు మరియు ఇతర వివరాలను స్పష్టం చేసిన తర్వాత ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఈ సంస్థలు ఈ యాప్‌ల ద్వారా పొందే పర్సనల్ లోన్‌పై రెండు శాతం ప్రాసెసింగ్ ఫీజు మరియు GSTని కూడా వసూలు చేస్తాయి మరియు ఈ పర్సనల్ లోన్‌పై 6-84 నెలల లోన్ రీపేమెంట్ వ్యవధిని అందిస్తాయి . అన్ని నిబంధనలు క్షుణ్ణంగా చదివి ఆ తర్వాత నచ్చితేనే లోన్ తీసుకోండి…
ఇక లోన్ కోసం ఆధార్ కార్డ్, ఉపాధి ధృవీకరణ పత్రం, మొబైల్ నెం, బ్యాంక్ పాస్ బుక్, జీతం స్లిప్, పాన్ కార్డ్, ఓటరు ID, 3-6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, రేషన్ కార్డు వంటివి తప్పనిసరి. మరోవైపు క్యాష్‌ఇ యాప్ ద్వారా రూ.1,000 నుంచి రూ.4 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్ పొందవచ్చు. ఈ యాప్ ప్రత్యేకమైన సోషల్ లోన్ క్వోషియంట్ SLQ ని ఉపయోగించి క్రెడిట్ యోగ్యతను అంచనా వేస్తుంది. అంటే, సోషల్ మీడియా ప్రొఫైల్ ఆధారంగా లోన్ అందుకునే అవకాశం ఉంది. కాబట్టి లోన్ తీసుకునేవారు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా ఓ సారి క్షుణ్ణంగా పరిశీలించుకోవడం మంచిది.