Baldness : బట్టతలతో లక్షలు సంపాదించిన ఓ వ్యక్తి .. ఏకంగా 71 లక్షలు సొంతం చేసుకున్నాడు ఇలా !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Baldness : బట్టతలతో లక్షలు సంపాదించిన ఓ వ్యక్తి .. ఏకంగా 71 లక్షలు సొంతం చేసుకున్నాడు ఇలా !!

 Authored By aruna | The Telugu News | Updated on :16 February 2023,3:00 pm

Baldness : బట్టతలతో లక్షలు సంపాదించడం ఏంటి అని అనుకుంటున్నారా . ఇది నిజంగానే జరిగింది. ఓ వ్యక్తి తన బట్టతలతో ఏకంగా 71 లక్షలు సొంతం చేసుకున్నాడు. అసలైతే చాలామంది బట్టతల అనేది ఒక లోపంగా భావిస్తారు. ఆ లోపాన్ని చూసి కొందరు నవ్వుతుంటారు. వివక్ష చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తనను ఎవరు ఎంతమంది అన్న నవ్వుకున్నా వివక్ష చూపిన అవేమీ పట్టించుకోలేదు. తనకున్న లోపంతోనే 71 లక్షలు సొంతం చేసుకున్నాడు. అలా అని ఇతను వ్యాపారం చేశారనుకొకండి. అతని బట్టతలే అతనికి లక్షలు తెచ్చిపెట్టింది కానీ ఇందులో ఒక తిరకాస్తు ఉంది. పూర్తి వివరాల్లోకెళితే.

man rewarded 71 lakhs with his Baldness

man rewarded 71 lakhs with his Baldness

ఇంగ్లాండ్ కు చెందిన మార్క్ జోన్ అనే వ్యక్తి లీడ్స్ నగరంలో టాంగో నెట్వర్క్ అనే ఫోన్ సంస్థలో సేల్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అతని వయసు 61 సంవత్సరాలు. అయితే ఆ వయసులో పొట్ట, బట్టతల రావడం సహజమే. అయితే అది అర్థం చేసుకోకుండా బాస్ బట్టతల ఉన్నవాళ్లు నా టీంలో ఉండటానికి వీల్లేదని జాబ్ లో నుంచి తీసేసాడట. బట్టతల అనే వంకతో మార్క్ జోన్ ని జాబు లో నుంచి తీసేసాడు. దీంతో మార్క్ జోన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనను అన్యాయంగా జాబ్ నుంచి తొలగించారని టాంగో నెట్వర్క్ కంపెనీ పరువు నష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మార్క్ జోన్ కి అనుకూలంగా తీర్పించింది.

man rewarded 71 lakhs with his Baldness

man rewarded 71 lakhs with his Baldness

మార్క్ జోన్ని కారణం లేకుండా వివక్షత చూపి ఉద్యోగం నుంచి తొలగించారంటూ టాంగో కంపెనీ పై 71 వేల పౌండ్ల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఇండియాలో 71 లక్షల 84 వేల చిల్లర అన్నమాట. దీంతో టాంగో కంపెనీ మార్క్ జోన్ కి 71 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే మార్క్ జోన్ బాస్ ది కూడా బట్టతలే ఉంది. ఇంగ్లాండ్ లో జరిగిన ఈ సంఘటన చూస్తే కొంచెం ఫన్నీగా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. బట్టతల ఉంటే ఏమైంది అదేమైనా లోపమా. అనవసరంగా 71 లక్షలు పోగొట్టుకున్నాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది