Business Ideas : సొంత ఊరిలోనే బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఈ బిజినెస్ చేస్తే రోజూ రూ.5 వేలు ఎటు పోవు
Business Ideas : చాలామంది పట్టణాల్లో బతకలేరు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే ఎంత సంపాదించినా అది మొత్తం ఖర్చులకే పోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే చేతుల్లో రూపాయి కూడా ఉండదు. అందుకే తమ ఊళ్లకు వెళ్లిపోయి ఏదైనా చిన్న బిజినెస్ చేసుకొని బతికితే చాలు అనుకుంటారు. అలా.. సొంత ఊరులోనే ఉండి డబ్బులు బాగా సంపాదించాలని అనుకునేవాళ్లకు మంచి బిజినెస్ ఐడియా ఇది. ప్రస్తుతం ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పడుతున్నాయి. ప్రజలు మంచి నీళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే ఊళ్లలోనూ మినరల్ వాటర్ ప్లాంట్ కు డిమాండ్ ఉంటుంది.
పెద్ద పెద్ద కంపెనీలు కూడా మినరల్ వాటర్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాయి. అందుకే ఊళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే చాలా బెటర్ గా ఉంటుంది.కాకపోతే ఈ బిజినెస్ ను పెట్టడానికి ముందు ఒక చిన్న కంపెనీని ప్రారంభించాల్సి ఉంటుంది. పాన్ కార్డు, జీఎస్టీ అన్నీ తీసుకొని ఆ తర్వాత ఐఎస్ఐ నెంబర్ ను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆర్వో యంత్రాలు, ప్లేస్.. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కనీసం రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ పెట్టుబడి పెట్టేందుకు అంత డబ్బు లేకపోతే బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు.
Business Ideas : ఆదాయం ఎంత వస్తుంది?
గంటకు వెయ్యి లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ప్రారంభిస్తే నెలకు రూ.50 వేల వరకు సంపాదించవచ్చు. రోజుకు కనీసం 200 వాటర్ బాటిల్స్ విక్రయించినా ఒక మినరల్ వాటర్ ధర రూ.25 ఉంటే.. రోజుకు రూ.5 వేల వరకు సంపాదించవచ్చు. అంటే నెలకు ఆదాయం రూ.1,50,000 వరకు ఉంటుంది. కాకపోతే పెట్టుబడికి రూ.1,00,000 వరకు పోతుంది. దీంతో రూ.50 వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు. కస్టమర్లు పెరిగితే లాభం కూడా ఆటొమెటిక్ గా పెరుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే మంచినీళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో ఇంకాస్త ఎక్కువే డబ్బు సంపాదించుకోవచ్చు.