Printed T-shirt Business : నెల నెలా రూ.వేలల్లో ఆదాయం సంపాదించి పెట్టే బిజినెస్‌.. పెట్టుబడి తక్కువే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Printed T-shirt Business : నెల నెలా రూ.వేలల్లో ఆదాయం సంపాదించి పెట్టే బిజినెస్‌.. పెట్టుబడి తక్కువే..!

 Authored By maheshb | The Telugu News | Updated on :16 February 2021,5:30 pm

printed t-shirt business : నెలనెలా రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ఆదాయం పొందాలని చూస్తున్నారా ? స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని అనుకుంటున్నారా ? అయితే ఈ వ్యాపారం మీ కోసమే. ఇందులో రూ.50వేలు పెట్టుబడి పెడితే చాలు. దాంతో నెలకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు సంపాదించవచ్చు. ఇంతకీ ఆ వ్యాపారం ఏమిటి ? అంటే…

printed t shirt business can earn thousands of rupees every month

printed t-shirt business can earn thousands of rupees every month

ప్రస్తుత తరుణంలో ప్రింటెడ్‌ టి-షర్టులకు మంచి గిరాకీ ఉంది. యూత్‌ ఎక్కువగా ఈ తరహా టి-షర్ట్‌లను ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే స్కూళ్లు, కాలేజీలు, కంపెనీలు, ఇనిస్టిట్యూట్స్‌, రాజకీయ పార్టీలు, ఇతర సంస్థలు తమ సంస్థలకు చెందిన లేదా అవి చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన ప్రింటెడ్‌ టి-షర్ట్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. అందువల్ల ఈ బిజినెస్‌కు చక్కని డిమాండ్‌ ఉందని చెప్పవచ్చు. సరిగ్గా మార్కెటింగ్‌ చేయగలిగితే నెల నెలా స్థిరమైన ఆదాయం కూడా పొందవచ్చు.

printed t shirt business can earn thousands of rupees every month

printed t-shirt business can earn thousands of rupees every month

ప్రింటెడ్‌ టి-షర్ట్‌ బిజినెస్‌ పెట్టేందుకు మెషిన్‌ అవసరం అవుతుంది. దాని ఖరీదు సుమారుగా రూ.50వేల వరకు ఉంటుంది. అందులో నిమిషానికి ఒక టి-షర్ట్‌ను ప్రింట్‌ చేయవచ్చు. ఇక ఒక్క తెలుపు రంగు టి-షర్ట్‌ ధర సుమారుగా రూ.120 ఉంటుంది. దానిపై ప్రింటింగ్‌కు రూ.1 నుంచి రూ.10 ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఒక్క టి-షర్ట్‌ను రూ.250 నుంచి రూ.300కు విక్రయించవచ్చు. దీంతో కనీసం ఎంత లేదాన్నా 50 శాతం లాభం వస్తుంది.

printed t shirt business can earn thousands of rupees every month

printed t-shirt business can earn thousands of rupees every month

ఇలా ఈ టి-షర్ట్‌లను ప్రింట్‌ చేసి అమ్ముతూ నెల నెలా రూ.వేలల్లో ఆదాయం పొందవచ్చు. అయితే వ్యాపారం వృద్ధి చెందితే నెల నెలా రూ.లక్షల్లో కూడా దీని ద్వారా డబ్బులను సంపాదించవచ్చు. ఇక ఈ టి-షర్ట్‌లను ఆన్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు. సొంతంగా ఏదైనా బ్రాండ్‌ను క్రియేట్‌ చేసి దాని పేరిట ఈ టి-షర్ట్‌లను అమ్మితే బ్రాండ్‌కు మంచి పేరు వస్తుంది. దీంతో బ్రాండ్‌ పాపులారిటీ ద్వారా కూడా మార్కెట్‌లో నిలదొక్కుకోవచ్చు. సుస్థిరమైన ఆదాయం రావాలంటే మార్కెటింగ్‌ సరిగ్గా చేయాల్సి ఉంటుంది. దీంతో లాభాలను గడించవచ్చు.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది