Business Ideas : చిన్న బ్లాగ్ నుంచి రూ.20 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే టెక్ కంపెనీని నెలకొల్పాడు.. ఎక్కడో తెలుసా?
Business Ideas : 37 ఏళ్ల అంకిత్ అగర్వాల్ ఒకప్పుడు చిన్న బ్లాగ్ ను నడిపించేవాడు. అది కూడా తను ఎంబీఏ చదివే సమయంలో యూనివర్సిటీకి చెందిన పలు కాలేజీలలో నిర్వహించే ప్రోగ్రామ్స్, కంటెస్ట్ ల గురించి స్టూడెంట్స్ కు తెలిసేలా చేసేందుకు అంకిత్ అగర్వాల్ చిన్న బ్లాగ్ ను నడిపించేవాడు. అది 2010లో. బ్లాగ్ మీద తను పని చేస్తున్న సమయంలోనే అంకిత్.. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ లో స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ లో చేరాడు. అప్పుడే అతడికి ఒక ఆలోచన వచ్చింది. ప్రతి స్టూడెంట్ బయట ఉన్న అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి.. ఎలా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి. సీవీ పాయింట్స్ ఎలా పొందాలి.. ఇలా అన్ని విషయాల గురించి స్టూడెంట్స్ తెలుసుకోవడం ప్రారంభించడంపై అంకిత్ కు ఐడియా తట్టింది.
హార్వార్డ్ లో స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ పూర్తి కాగానే ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ కంపెనీలు అంకిత్ ను అప్రోచ్ అయ్యాయి. తన బ్లాగ్ కు ఇంప్రెస్ అయిన కంపెనీలు దాన్ని వెబ్ సైట్ గా మార్చి ఎంప్లాయర్ బ్రాండ్ గా మార్చి పలు కాలేజీ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ కావాలని సూచించాయి. 2017 లో ఆ బ్లాగ్ మీద వర్క్ చేసి దాన్ని పెద్ద బ్రాండ్ గా తీర్చిదిద్దాడు. కొన్ని స్కూళ్లు, కాలేజీలతో టైఅప్ అయ్యారు. 2021 లో పెద్ద ప్లాట్ ఫామ్ అయింది. అన్ స్టాప్ పేరుతో బ్లాగ్ నుంచి పెద్ద టెక్ స్టార్టప్ ను డెవలప్ చేశాడు అంకిత్. టాలెంట్ ఎంగేజ్ మెంట్, హైరింగ్ ప్లాట్ ఫామ్ గా పేరు పొందిన ఈ స్టార్టప్ కు ప్రస్తుతం 50 లక్షల మంది యూజర్లు ఉన్నారు.
Business Ideas : 50 లక్షల యూజర్లతో టాప్ లో నిలిచిన అంకిత్ కంపెనీ అన్ స్టాప్
గత సంవత్సరం ఈ కంపెనీ రూ.20 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంకిత్ కంపెనీ ఇటీవల షార్క్ ట్యాంక్ లోనూ షోకేస్ అయింది. షార్క్ ట్యాంక్ నుంచి రూ.5 కోట్ల ఆఫర్ వచ్చినా అంకిత్ సున్నితంగా తిరస్కరించాడు. భవిష్యత్తులో స్టూడెంట్స్, ఎంప్లాయర్స్ తో కమ్యూనిటీని ఏర్పాటు చేసి స్టూడెంట్స్ కెరీర్ కు ఒక మార్గాన్ని సూచించే విధంగా అన్ స్టాప్ ను తీర్చిదిద్దుతామని అంకిత్ సగర్వంగా చెప్పుకొచ్చాడు. ఇంతకీ అంకిత్ ది ఎక్కడో చెప్పలేదు కదా.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన అంకిత్.. ఇప్పుడు ప్రపంచమంతా తన ఐడియాతో తెలిసిపోయాడు. తన కంపెనీని కూడా ఢిల్లీలోనే ఏర్పాటు చేశాడు.
View this post on Instagram