Business idea : చీరలపై ఉన్న ఇష్టంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి.. 50 కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అక్కాచెల్లెలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business idea : చీరలపై ఉన్న ఇష్టంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి.. 50 కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన అక్కాచెల్లెలు

 Authored By jyothi | The Telugu News | Updated on :26 February 2022,8:20 am

Business idea : టెక్స్‌టైల్స్ రంగంలో ఏలాంటి నేపథ్యం లేకుండానే ఆ ఇద్దరు సోదరీమణులు అద్భుతం చేశారు. 16 వేల మంది నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూనే… ఒక బ్రాండ్‌ ను నెలకొల్పి దానిని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు రూ. 50 కోట్ల బ్రాండ్‌గా అవతరించింది. ఆ ఇద్దరు సోదరీమణుల పేరు సుజాత మరియు తనియా బిస్వాస్. తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలిపెట్టి, నేత కార్మికులకు సాధికారత కల్పించడంతో పాటు.. అందమైన చీరలను మహిళలకు అందించాలన్న తలంపుతో ‘సుతా’ను ప్రారంభించారు. చేనేత మరియు హస్తకళాకారులను ఒక తాటిపైకి తెచ్చి వారి ఉత్పత్తులకు వీరి క్రియేటివిటీని జోడించి చీరలను తయారు చేయడం మొదలుపెట్టారు.

జమదానీ నేత, ముల్ముల్, మల్కేష్, బనారసి వంటి వాటితో చీరలను తయారు చేస్తూ వాటిని అమ్మడం మొదలు పెట్టారు. వీళ్ల పనితనం నచ్చిన చాలా మంది సుతా చీరలను కొనడం ప్రారంభించారు. అనతికాలంలోనే ‘సుతా’ బ్రాండ్ కాటన్ చీరలకు ప్రసిద్ధి చెందింది.’సుతా’ కొన్ని రకాల కాటన్ సారీలను మాత్రమే తయారు చేయలేదు. విభిన్న సంప్రదాయలకు చెందిన కాటన్ చీరలను తయారు చేయడంతో విభిన్న సంస్కృతికి, సంప్రదాయాలకు చెందిన వినియోగదారులను పొందారు. అనంతరం స్వచ్ఛమైన మల్బరీ సిల్క్, హ్యాండ్లూమ్ ఇకాట్స్ మరియు లినెన్ వంటి వాటితో కూడా పని చేయడం మొదలు పెట్టింది ‘సుతా’. దాదాపు 16 వేల మంది చేనేత కార్మికులు, కళాకారులతో ‘సుతా’ పనిచేస్తోంది. వారిని కేవలం పని వారిగా కాకుండా కాంట్రాక్టు ప్రాతిపదికన చీరలు ఉత్పత్తి చేస్తోంది.

suta sarees brand helps weavers artisans earn sujata taniya biswas

suta sarees brand helps weavers artisans earn sujata taniya biswas

సుమారు ఆరేళ్ల కాలంలో రూ.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వ్యాపారంగా ఎదిగింది ‘సుతా’.’సుతా’ ఇప్పుడు పురుషుల కుర్తాలను ప్రారంభించింది. త్వరలోనే మహిళల కుర్తాల్లోకి ప్రవేశించనుంది. లాంజ్‌వేర్, హోమ్ డెకర్, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలు మొదలైన వాటినీ ‘సుతా’ ఇప్పటికే అందిస్తోంది.’సుతా’ ఇప్పుడు ఇంత పెద్ద బ్రాండ్‌గా అవతరించినప్పటికీ.. మొదట్లో ఈ ఇద్దరు సోదరీమణులు చాలానే కష్టాలు పడ్డారు. వారికి ఒక బ్రాండ్‌ ఏర్పాటు చేసి చీరలను అమ్మాలన్న ఐడియా అయితే ఉంది కానీ.. అందులో వారికి ఎలాంటి నైపుణ్యం లేదు. నాణ్యమైన వస్త్రం, నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు దొరకడం వారికి చాలా కష్టంగా మారింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ వెళ్లాల్సి వచ్చింది.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది