Mushroom Business : ఈ పుట్టగొడుగుల ధర కిలో రూ.20 లక్షలు.. ఒక్క కిలో అమ్ముకున్నా కోటీశ్వరులు అవుతారు

Advertisement

Mushroom Business : మీకు పుట్టగొడుగులు తెలుసు కదా. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్నింటిని తినవచ్చు. మరికొన్ని తినలేం. పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఆ పోషకాల వల్లనే పుట్టగొడుగులకు అంత డిమాండ్. పుట్టగొడుగులను కొందరు అయితే బిజినెస్ గా మార్చుకొని లక్షలు సంపాదిస్తున్నారు. చాలామంది పుట్టగొడుగుల బిజినెస్ చేస్తున్నారు. అయితే.. సాధారణ పుట్టగొడుగుల బిజినెస్ చేస్తే పెద్దగా వచ్చేదేం ఉండదు. కానీ.. ఒక అరుదైన పుట్టగొడుగుల బిజినెస్ చేస్తే మాత్రం మీరు కోటీశ్వరులు అవ్వాల్సిందే. దాని కోసం క్వింటాలకు క్వింటాలు పుట్టగొడుగులు పండించాల్సిన అవసరం లేదు.

Advertisement

ఒక్క కిలో పుట్టగొడుగులు పండించినా చాలు మీరు కోటీశ్వరులు అవడం గ్యారెంటీ. అవును.. అది చాలా అరుదైన పుట్టగొడుగు. దాని పేరు యార్సగుంబా. వీటికే మరో పేరు కూడా ఉంది. హిమాలయాన్ వయగ్రా అని కూడా అంటారు. ఇవి వయాగ్రాలా పనిచేస్తాయి అన్నమాట. ఈ అరుదైన పుట్టగొడుగులను కూరగా చేసుకొని తినవచ్చు. లేదంటే ఔషధాల్లోనూ వాడుతారు.అంతర్జాతీయ మార్కెట్ లో యార్సగుంబా అనే పుట్టగొడుగుకు బీభత్సమైన డిమాండ్ ఉంది. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రూ.20 లక్షల వరకు ధర పలుకుతోంది. వీటిని ఎక్కడ పడితే అక్కడ సాగు చేయరు. హిమాలయ ప్రాంతాల్లోనే ఈ పుట్టగొడుగులను పండిస్తున్నారు.

Advertisement
yarsagumba which is a mashroom sells for 20 lakhs per kg
yarsagumba which is a mashroom sells for 20 lakhs per kg

Mushroom Business : అంతర్జాతీయ మార్కెట్ లో ఈ పుట్టగొడుగుకు భారీ డిమాండ్

ఒకవేళ వీటిని మనం మన వాతావరణ పరిస్థితుల్లో పండించాలంటే సపరేట్ గా దాని కోసం ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని అందులో పండించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతు గౌరవ్ కశ్యప్ ఈ పుట్టగొడుగులను సాగు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పుట్టగొడుగుల మీద మన దేశంలో భారీగానే వ్యాపారం సాగుతోంది. వీటిని పలు ట్యాబ్లెట్ల తయారీలోనూ వాడుతారట. అందుకే వీటికి అంత డిమాండ్.

Advertisement
Advertisement