Chittor..శ్రీవారికి డిఫరెంట్ బ్రాండ్స్ అగరబత్తీలు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో శ్రీవారికి భక్తులు డిఫరెంట్ బ్రాండ్స్ అగరబత్తీలు సమర్పించనున్నారు. స్వామి వారు ఏడు కొండలకు సూచికగా ఏడు బ్రాండ్స్ అగరబత్తీలను విక్రయాలను ఈ నెల 13 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు. భక్తులు ఏడు కొండల స్వామి ఇక నుంచి ఏడు బ్రాండ్స్ అగరబత్తీలు సమర్పించుకోవచ్చు. అయితే, టీటీడీ టెంపుల్స్‌లో పూజలు, అలంకరణలకు ప్రతీ రోజు పుష్పాలు వినియోగిస్తుండటం మనకు తెలిసిందే. ఇకపోతే ఉత్సవాల సమయంలో, పర్వదినాల్లో పుష్పాల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. కాగా, స్వామి వారి సేవకు ఉపయోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయమై టీటీడీ ఆలోచన చేసింది.
ఈ క్రమంలోనే బెంగళూరు సంస్థ దర్శన్ పుష్పాలను అగరబత్తీలు తయారు చేసి అందించేందకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో టీటీడీ అవగాహన కుదుర్చుకుంది. దర్శన్ సంస్థ కోసం ఎస్వీ గోశాలలో అగరబత్తీల తయారీకి అవసరమైన స్థలం కూడా టీటీడీ కేటాయించింది. ఈ ప్లేస్‌లో దర్శన్ సంస్థ తన సొంత ఖర్చులతో మెషిన్లు ఏర్పాటు చేసుకుని తమ సిబ్బంది చేత ప్రయోగాత్మకంగా ఆల్రెడీ అగరబత్తీల ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. త్వరలో అందుబాటులోకి వచ్చే అగరబత్తీల బ్రాండ్స్ పేర్లు ఇవే..దృష్టి, అభయహస్త, ఆకృష్టి, తందనాన, సృష్టి, దివ్యపాద, తుష్టి.