Chittoor..ఫ్లవర్స్ రీయూజ్.. అందుబాటులో ఏడు బ్రాండ్ల అగరబత్తీలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తయారు చేసిన ఏడు బ్రాండ్ల అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ ఆధ్వర్యంలోని 50 దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజల్లో ఉపయోగించిన పూలతో ఈ అగరబత్తీలను తయారు చేస్తున్నారు. తిరుపతి ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రాన్ని తిరుపతి శాసన సభ్యుడు భూమన కరుణాకరరెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, ఏఈవో తదితరులు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా దర్శన్ సంస్థ పూలను ఉపయోగించి అగర్‌బత్తీలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే దర్శన్ సంస్థ తయారు చేస్తున్న ఏడు రకాల బ్రాండ్స్ అగరబత్తీలను ఆల్రెడీ భక్తులు కొనుగోలు చేస్తున్నారు. టీటీడీ సప్తగిరి మాసపత్రికను తిరిగి తీసుకొచ్చింది.
రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన బ్రాండ్స్ పేర్లు ఇవే.. దివ్యపాద, ఆకష్టి, అభయహస్త, తందనాన, తుష్టి, దష్టి, స్పష్టి. లడ్డూ కౌంటర్స్ వద్ద, పస్తకాల విక్రయ కేంద్రాల వద్ద ఈ అగరబత్తీలు అవెయిలబుల్‌గా ఉన్నాయి. ఈ అగరబత్తీలను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు.