Chittor..వ్యాక్సినేషన్ వేగవంతం చేయండి: కలెక్టర్ హరినారాయణన్
కుప్పం మండల టాస్క్ ఫోర్సు అధికారులతో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వందశాతం వ్యాక్సినేషన్ దిశగా అధికారులు పని చేయాలన్నారు. ఈ క్రమంలోనే ఫీవర్ సర్వే ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చిన క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పేషెంట్స్‌కు తగు ట్రీట్‌మెంట్ అందే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
థర్డ్ వేవ్ ముప్పు పొంచిన నేపథ్యంలో పాజిటివ్ పేషెంట్స్‌ను ఐసొలేట్ చేయాలని, సామాన్య జనంతో వారిని కాంటాక్ట్ కాకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్‌లో సీజనల్ డిసీజెస్ ప్రబలే చాన్సెస్ ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కుప్పంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరును అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హరినారాయణన్‌కు వివరించారు. జనాలు కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకు పొంచిన నేపథ్యంలో వారిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు.