Chittoor..మరో దుర్మార్గుడు.. ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నం | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Chittoor..మరో దుర్మార్గుడు.. ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నం

హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు ప్రకటించారు. కాగా, ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. ఏపీలోని చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నం చేశాడు. ఇందిరమ్మకాలనీలో మంగళవారం రాత్రి జరిగగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. అనిల్ కుమార్ […]

 Authored By praveen | The Telugu News | Updated on :15 September 2021,1:54 pm

హైదరాబాద్ సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు ప్రకటించారు. కాగా, ఈ ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. ఏపీలోని చిత్తూరు జిల్లా బీ కొత్తపేట మండలంలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నం చేశాడు. ఇందిరమ్మకాలనీలో మంగళవారం రాత్రి జరిగగా, బుధవారం వెలుగులోకి వచ్చింది. అనిల్ కుమార్ అనే 21 ఏళ్ల యువకుడు ఆరు బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు.

తొలుత తొమ్మిదేళ్ల వయసున్న బాలికపై లైంగిక దాడికి యత్నించగా, ఆమె అతడి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత మరో ఏడేళ్ల బాలికను తొడలమీద కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. తొమ్మిదేళ్ల బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన అమ్మమ్మ సావిత్రికి చెప్పగా ఆమె మిద్దేమీదకు వెళ్లి చూడగా కీచకుడు అనిల్ అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. దాంతో సావిత్రి వెంటనే ‘దిశ’యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

 

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది