చిత్తూరులో ఫ్యాన్ ప్రభంజనం..టీడీపీ చిత్తు చిత్తు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

చిత్తూరులో ఫ్యాన్ ప్రభంజనం..టీడీపీ చిత్తు చిత్తు

ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజెంట్ విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కాగా, రోజురోజుకూ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైపోతున్నది. తాజాగా ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా చూపింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలోనూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ పరాజయాన్ని మూటకట్టుకుంది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు‌గాను 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం […]

 Authored By praveen | The Telugu News | Updated on :20 September 2021,2:16 pm

ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రజెంట్ విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. కాగా, రోజురోజుకూ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైపోతున్నది. తాజాగా ఏపీలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ హవా చూపింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలోనూ ఫ్యాన్ ప్రభంజనం సృష్టించింది. టీడీపీ పరాజయాన్ని మూటకట్టుకుంది. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు‌గాను 74 చోట్ల వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

ఇకపోతే కేవలం 14 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఇక ఒకే ఒక చోట కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు విక్టరీ సాధించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైసీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో టీడీపీ పార్టీ కనిపించే పరిస్థితులు ఉండవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది