మనం నిత్యం పూజించే గణపతి యొక్క రూపాలు తెలిసిన వాళ్ళలో మీరుంటే ఎంత అదృష్ఠవంతులో తెలుసా ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

మనం నిత్యం పూజించే గణపతి యొక్క రూపాలు తెలిసిన వాళ్ళలో మీరుంటే ఎంత అదృష్ఠవంతులో తెలుసా ..?

మనం నిత్యం చెప్పుకొనే శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే, అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం,అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే అని స్మరణ చేస్తూ మన పనులని ఆరంబించడం మత్రమే మనకు తెలుసు నిజానికి వినాయకునికి ముప్పై రెండు రూపాలు ఉన్నట్లు హిందూ మతం గణేశ (గణపతి) కు చెందిన భక్తి సాహిత్యంలో తరచుగా పేర్కొనబడ్డాయి. అందులో గణేష-సెంట్రిక్ గ్రంథము ముద్గలపురాణము మొదటిది. 19 వ శతాబ్దపు […]

 Authored By uday | The Telugu News | Updated on :17 December 2020,6:30 am

మనం నిత్యం చెప్పుకొనే శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్‌ సర్వ విఘ్నోప శాంతయే, అగజానన పద్మార్కం గజాననమ్‌ అహర్నిశం,అనేకదమ్‌ తమ్‌ భక్తానాం ఏకదంతమ్‌ ఉపాస్మహే అని స్మరణ చేస్తూ మన పనులని ఆరంబించడం మత్రమే మనకు తెలుసు నిజానికి వినాయకునికి ముప్పై రెండు రూపాలు ఉన్నట్లు హిందూ మతం గణేశ (గణపతి) కు చెందిన భక్తి సాహిత్యంలో తరచుగా పేర్కొనబడ్డాయి. అందులో గణేష-సెంట్రిక్ గ్రంథము ముద్గలపురాణము మొదటిది. 19 వ శతాబ్దపు కన్నడ శ్రీ తత్త్వనిధిలో శివనిధి భాగంలో వివరణాత్మక వర్ణనలు చేర్చబడ్డాయి. కర్ణాటకలోని మైసూర్ జిల్లా దేవాలయాలలో అక్కడి చక్రవర్తి ఆదేశాలతో ఈ ముప్పై రెండు రూపాల శిల్పాలు అదే సమయంలో చిత్రలేఖనం చేయబడ్డాయి.

మనం నిత్యం పూజించే గణపతి యొక్క రూపాలు తెలిసిన వాళ్ళలో మీరుంటే ఎంత అదృష్ఠవంతులో తెలుసా

32 Forms of Loard Ganesha

ముప్పై రెండు దృష్టాంతాలు ధ్యాన శ్లోకాలు కన్నడ లిపిలో రాసి చిన్న సంస్కృత ధ్యాన పదములతో కలిసి ఉంటాయి. ధ్యానం శ్లోకాలు ప్రతి రూపం యొక్క లక్షణాలు ఆ జాబితాలో చెక్కబడినవి. మార్టిన్ డ్యూబౌస్ట్ రాసిన పత్రాల ప్రకారం, శ్రీతత్వనిధి దక్షిణ భారతంలో ఇటీవలికాలంలో ప్రచురితమైనట్లు, ఈ పత్రాల్లో ఆ కాలంలో ఆయాప్రాంతాల్లో విరివిగా ఉన్న గణేశ రూపాలని పొందుపరిచినప్పటికీ, 4 వ శతాబ్దం నుండి ఉనికిలో ఉన్న రెండు చేతుల, 9 వ, 10 వ శతాబ్దాలలో మధ్య భారతదేశంలో కనిపించిన పద్నాలుగు, ఇరవై చేతుల వినాయకుడిని వర్ణించడం మాత్రం జరగలేదు. ఆ ముప్పై రెండు రూపాల గణపతుల రూపాలు ఇవే.

మనం నిత్యం పూజించే గణపతి యొక్క రూపాలు తెలిసిన వాళ్ళలో మీరుంటే ఎంత అదృష్ఠవంతులో తెలుసా

32 Forms of Loard Ganesha

1. శ్రీ గణపతి, 2. వీర గణపతి, 3. శక్తి గణపతి, 4. భక్త గణపతి, 5. బాల గణపతి, 6. తరుణ గణపతి, 7. ఉచ్చిష్ట గణపతి, 8. ఉన్మత్త గణపతి, 9. విద్యా గణపతి, 10. దుర్గ గణపతి, 11. విజయ గణపతి, 12. వృత్త గణపతి, 13. విఘ్న గణపతి, 14. లక్ష్మీ గణపతి, 15. నృత్య గణపతి, 16. శక్తి గణపతి, 17. మహా గణపతి, 18. బీజ గణపతి, 19. దుంఢి గణపతి, 20. పింగళ గణపతి, 21. హరిద్రా గణపతి, 22. ప్రసన్న గణపతి, 23. వాతాపి గణపతి, 24. హేరంబ గణపతి, 25. త్ర్యక్షర గణపతి, 26. త్రిముఖ గణపతి, 27. ఏకాక్షర గణపతి, 28. వక్రతుండ గణపతి, 29. వరసిద్ధి గణపతి, 30. చింతామణి గణపతి, 31. సంకష్టహర గణపతి, 32. త్రైలోక్యమోహనగణపతి.

ఇక ముప్పై రెండు రూపాలకు ఉన్న ప్రత్యేకతలను ది తెలుగు న్యూస్ ఆధ్యాత్మికం లో క్షుణ్ణంగా తెలుసుకుందాం.

Also read

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది