Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కొనాల్సిన అవసరం లేదు… వీటిని కొన్న లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కొనాల్సిన అవసరం లేదు… వీటిని కొన్న లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది….?

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కొనాల్సిన అవసరం లేదు... వీటిని కొన్న లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది....?

Akshaya Tritiya 2025 : హిందూ ధర్మంలో అక్షయ తృతీయ రోజు పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది. 2025 వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఈ తిధినాడు ప్రజలు ఏదో ఒక వస్తువుని ఉండడం సాంప్రదాయంగా వస్తుంది. కొందరు బంగారం వెండి వంటి విలువైన లోహాలనుకుంటే.. మరికొందరు వాహనాలు ఇల్లు లేదా దుకాణాలు కొంటారు. అందరూ భారీ మొత్తంలో డబ్బులను వెచ్చించలేరు. వీటిలో వీరు కనుక కొనలేకపోతే నిరుత్సాహపడకండి. వెండి కొనలేని వారు ఈ ఐదు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న అదృష్టం,లక్ష్మీదేవి అనుగ్రహం ఈ వస్తువులను కొన్నా కలుగుతుంది.ఆ ఏమిటో తెలుసుకుందాం. విశాఖ మాసంలో వచ్చే శుక్లపక్షంలో మూడవ రోజున అక్షయ తృతీయ వస్తుంది. ఇలా రావడానికి అక్షయ తృతీయ అంటారు. రోజు చేసే శుభకార్యాలు శాశ్వత ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. కాబట్టే దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తారు. నిండు నెలలలో ప్రతి శుక్లపక్ష తృతీయ శుభప్రదమైనదిగా కూడా నమ్ముతారు. వైశాఖమాసంలో తృతీయ అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు.

Akshaya Tritiya 2025 అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కొనాల్సిన అవసరం లేదు వీటిని కొన్న లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజు కేవలం బంగారమే కొనాల్సిన అవసరం లేదు… వీటిని కొన్న లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది….?

Akshaya Tritiya 2025 క్షయ తృతీయ రోజు ఈ 5 వస్తువులను కొనడం వలన శుభప్రదం

అక్షయ తృతీయ అనేది చాలా పవిత్రమైన సమయం. ఈరోజు నా ఏ పంచాంగం చూడకుండానే ఏ పని అయినా చేయవచ్చు. ఈ రోజున వివాహం,గృహప్రవేశం, నామకరణ వేడుక, పూజ వంటి ఏదైనా శుభకార్యం శుభప్రదంగా పరిగణించడం జరిగింది. దీనితోపాటు ఈరోజు బట్టలు, నగలు, ఇల్లు,ప్లాట్లు, వాహనాలు మొదలైనవి కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించడం జరిగింది. అక్షయ తృతీయనాడు ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులను కొనలేని వారు నిరాశ చెందవద్దు. ఇంట్లోకి ఈ 5 వస్తువులను కొని ఇంటికి తీసుకు తెచ్చుకోండి. క్షయ తృతీయ నాడు పత్తి దూది మీరు ఇంటికి తీసుకు రావలసిన వస్తువు ఒకటి పత్తి. కాబట్టి అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన పత్తిని ఇంటికి తీసుకురండి. పత్తి కొంటే చాలా శుభప్రదంగా చెప్పబడింది.ఇది వ్యాపారాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది.
రాతి ఉప్పు మీరు ఇంటికి తీసుకు రావలసిన రెండవ వస్తువు. ఇంటికి తీసుకు వస్తే శ్రేయస్సు కలుగుతుందని అంటారు. క్షయ తృతీయ రోజు కొనుగోలు చేసిన ఉప్పుని ఆ రోజు తినకూడదు అనే విషయం ముఖ్యంగా గుర్తుంచుకోండి.

మూడవ వస్తువు మట్టి కుండలు. ఈ రోజు మీరు కుండను, గిన్నె, ప్రమిద ఇలాంటి మట్టితో చేసిన పాత్రలను కొనుగోలు చేయవచ్చు. బంగారం కొనలేని వారు మట్టికుండలను కొనడం కూడా బంగారం కొన్న ఫలితాన్ని ఇస్తుంది.మట్టి కుండలు కూడా బంగారాన్ని కొన్నట్లే పరిగణించడం జరిగింది. బార్లీ లేదా పసుపు ఆవాలు అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తీసుకురండి. హార్లీ లేదా పసుపు,ఆవాలు కొనడం బంగారం వెండి వంటి లోహాలను కొన్నంత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు నిపుణులు. లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు అక్షయ తృతీయ రోజున కొనడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా గవ్వలతో పాటు మీ ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఎందుకంటే లక్ష్మీదేవి కి గవ్వలంటే చాలా ప్రీతి. ఈరోజు నా 11 గవ్వలను కొని వాటిని ఎన్నటి వస్త్రంలో చుట్టి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేస్తే వంటింట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్మకం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది