Today Gold Price : అక్షయ తృతీయ సందర్బంగా తగ్గిన బంగారం ధర
ప్రధానాంశాలు:
Today Gold price : అక్షయ తృతీయ సందర్బంగా తగ్గిన బంగారం ధర
Today Gold price : అక్షయ తృతీయ పండుగ సందర్భంగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ 30 (బుధవారం) నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,980గా నమోదవ్వగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,810గా ఉంది. వెండి కూడా రూ.1,10,900కి కిలో పలికింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తుండగా, అక్షయ తృతీయ రోజున మరింత తగ్గింది. బంగారం ధర తగ్గడంలో ప్రధాన కారణంగా అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ బలపడటం, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు కీలకంగా మారాయి.

Today Gold Price : అక్షయ తృతీయ సందర్బంగా తగ్గిన బంగారం ధర
గత కొంత కాలంగా బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని తాకి, లక్ష రూపాయల దాటిపోయిన సమయంలో, ఇప్పుడు దాదాపు నాలుగు వేల రూపాయలు తగ్గిన విషయం వినియోగదారులకు ఊరట కలిగించింది. వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పాటు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా తో సయోధ్యకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం, చైనా టారిఫ్ తగ్గించే ఆలోచనలు చేస్తుండటం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. స్టాక్ మార్కెట్లు బలపడితే బంగారం ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాల వల్ల బంగారంలో పెట్టుబడులు పెట్టిన కొంతమంది ఇన్వెస్టర్లు, తమ నిధులను స్టాక్ మార్కెట్లకు మళ్లించనున్న పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా బంగారం ధర రూ.70,000ల లోపు ఉండగా, ఇప్పుడు అది లక్షకు చేరుకుంది. అంటే సంవత్సరంలోనే దాదాపు 30 శాతం పెరిగింది. ఇది బంగారం లో పెట్టుబడి పెట్టినవారికి మంచి లాభాలను అందించగా, తాజాగా ధరలు తగ్గిన నేపథ్యంలో కొనుగోలు దారులు తిరిగి బంగారం కొనుగోలుపై దృష్టి సారించే అవకాశం ఉంది.