Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనేవారు… అసలు ఈ టైం లో కొనవద్దంట…?
ప్రధానాంశాలు:
Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనేవారు... అసలు ఈ టైం లో కొనవద్దంట...?
Akshaya Tritiya : ప్రతి ఏడాది కూడా వైశాఖమాసం శుక్లపక్షం నా మూడవరోజు వస్తుంది,ఈ అక్షయ తృతీయ. అయితే, పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ తేదీ ఏప్రిల్ 30న వస్తుంది.ఈ అక్షయ తృతీయ పర్వదినంను పుణ్యదినంగా పరిగణించడం జరిగింది. రోజు దానధర్మాలు చేసే కార్యాన్ని ఎవరైతే చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుందని భావిస్తారు. ఈరోజు నా బంగారం కొనడం కూడా శుభప్రదంగా భావిస్తారు. రోజు చేసే పుణ్యకార్యం వల్ల ఎప్పటికీ కూడా నష్టం కలగదని ఓ విశ్వాసం ఉంది. కావునా, ఈ ప్రత్యేక రోజులో బంగారం కొనడానికి శుభసమయాలను ఎప్పుడూ ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం.

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనేవారు… అసలు ఈ టైం లో కొనవద్దంట…?
Akshaya Tritiya అక్షయ తృతీయ రోజు బంగారం ఏ టైంలో కొనాలి
అయితే కాశి జ్యోతిష్య నిపుణుడు పండిట్ సంజయ్ ఉపాధ్యాయ చెప్పిన ప్రకారం అక్షయ తృతీయ రోజున బంగారం, భూమి, ఫ్లాట్, వాహనం వంటివి కొనడం శుభంగా పరిగణించడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభం, వృశ్చికం, సింహం, కుంభరాశుల వివాహాలు స్థిరంగా సాగుతాయని భావించబడుతుంది. మన హిందూ ధర్మ పంచాంగం ఆధారంగా.. ఈ రోజు మూడు శుభ సమయాలు ఉన్నాయి..
మొదటి ముహూర్తం ఉదయం 6:18 – 08 : 20 అరకు వృషభ రాశికి అనుకూలమైన సమయం.2 వ ముహూర్తం మధ్యాహ్నం 12 : 46 – 3:00 వరకు ఇది అత్యుత్తమ సమయంగా పరిగణించబడింది. సమయంలో సింహ రాశి వారికి మంచి అనుకూలత ఉంటుంది. చివరిది సాయంత్రం 7: 00 – 9 :46 వరకు. ఇది కూడా మంచి సమయంగా చెప్పబడుతుంది.
వేద కాలంలో, అక్షయ తృతీయ అంటే మహా పుణ్య దినం. ఈసారి ఈరోజు శుభయోగం. సర్వార్ధ సిద్ధియోగం కలయిక వస్తుంది. అంతేకాదు, రవియోగం రాత్రంతా కొనసాగుతుంది. దీనివల్ల శుభకార్యాలకు ఎలాంటి అపవాదం ఉండదు.
Akshaya Tritiya నిర్థిష్ట సమయం అవసరం లేని పెళ్లి వేళ
ఈరోజు జరిగే శుభకార్యానికైనా శాశ్వత ఫలితాలు ఉన్నాయని నమ్మకం. కాబట్టి వివాహం, క్షవ్ రకర్మ,తినే, త్రాగే కార్యాలు కూడా నిర్దిష్ట సమయం లేకుండా చేయబడతాయి. అక్షయ తృతీయ అంటే శుభం కోసం ఎదురు చూసే వారికి దేవతల వరం.