Goddess Lakshmi : ఉప్పుని చేతితో ఇస్తున్నారా.. లక్ష్మీదేవి ఆగ్రహించడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Goddess Lakshmi : ఉప్పుని చేతితో ఇస్తున్నారా.. లక్ష్మీదేవి ఆగ్రహించడం ఖాయం...!
Goddess Lakshmi : హిందూ సాంప్రదాయాలలో పురాణాలలో మరికొన్ని నమ్మకాల లో ఉప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఉప్పుని ఇతరులకు ఇవ్వడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఇది విశ్వాసాలతో ఆచారాల తో ముడిపడి ఉంటుంది. అటువంటి ఉప్పు వెనక ఆధ్యాత్మిక సాంస్కృతిక కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Goddess Lakshmi : పురాణాల ప్రకారం..
ప్రతి ఆహారానికి ఉప్పు అనేది చాలా ముఖ్యం. అయితే భారత సాంప్రదాయాలలో ఉప్పు శుద్ధితో మరియు శ్రద్ధలతో కూడిన పదార్థంగా భావిస్తారు. ఈ క్రమంలోనే చేతితో ఉప్పుని ఇవ్వడం అనేది ప్రతి కూలన శక్తికి సంకేతంగా చెబుతారు. దీనిని అ శుభంగా మరియు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు దారి తీస్తాయని నమ్మకం. అంతేకాకుండా ఉప్పు నీ చేతితో ఇవ్వడం వలన ఆర్థిక సమస్యలు అనర్ధాలు తలెత్తుతాయని మరికొందరు భావిస్తారు. హిందూ ధర్మంలో ఉప్పుని లక్ష్మీదేవిగా భావిస్తారు. ఇక ఉప్పు నీ చేతితో ఇస్తే లక్ష్మీదేవిని ఇవ్వడం ఒకటే అని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో సంపద తగ్గిపోతుందని అలాగే ఇంట్లో గొడవలు తలెత్తుతాయి. ముఖ్యంగా శని ప్రభావం వారి పై పడుతుందని భావిస్తారు.
Goddess Lakshmi : ఆధ్యాత్మిక దృష్టికోణం
ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉప్పు శుద్ధి మరియు ప్రక్షాళనకు సంకేతం కావడంతో చేతితో ఉప్పు ఇవ్వడం వలన అది నష్ట శక్తులను అందిస్తుంది. కాబట్టి ఉప్పుని చేతితో కాకుండా పాత్రలో పెట్టి ఇస్తే అది సంపూర్ణ శుభ్రతను కలిగి ఉంటుంది.
ఆచరణాత్మక కారణాలు : సాధారణంగా ఉప్పు తేమను కరిగే పదార్థం. దీనిని చేతితో ఇవ్వడం వలన తేమను పొందుతుంది. దీనివల్ల అది గట్టిపడుతుంది. ముఖ్యంగా వంట గదిలో ఉప్పు జారిపోతే అది నష్టాలను సంభవిస్తాయి.
తర్కపరమైన కోణం : చేతితో ఉప్పు ఇవ్వడం తీసుకోవడం అనేది వ్యాపార లేదా నైతిక సంబంధాలకు ఎలాంటి తేడాలు తెస్తుంది అనడంలో ఎలాంటి సాంకేతికం లేదు. ముఖ్యంగా ఆచారానికి వ్యక్తిగతనికి సంబంధించిన విషయం. అయితే నేటి ఆధునిక కాలంలో ఇలాంటి ఆచారాలు కొంతమంది పాటిస్తున్నారు. ఇక శాస్త్రీయం గా శరీరానికి ఉప్పు ఎంతో మేలును కలిగిస్తుంది. Are you giving salt by hand.. Goddess Lakshmi is sure to get angry