August Born peoples : ఆగస్టులో పుట్టిన జాతకులు ఇలాగే ఉంటారట… జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…!
ప్రధానాంశాలు:
August Born peoples : ఆగస్టులో పుట్టిన జాతకులు ఇలాగే ఉంటారట... జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే...!
August Born peoples : ఆస్ట్రాలజీ ప్రకారం ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు…? వారి ఆర్థిక స్థితి మానసిక స్థితి ఎలా ఉంటుంది…? ఆగస్టు నెలలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది..? ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలాంటి అనుభవాలను చూస్తారు…?? ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆగస్టులో పుట్టిన వారికి మిగిలిన వారి కంటే పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అలాగే వీరికి సహాయం చేసే వాళ్ళు తక్కువ వారి అంతట వారే పైకి రావాల్సి ఉంటుంది. ఆగస్టులో పుట్టిన వారు సహాయం చేసే గుణం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. బంధువులు స్నేహితులు తెలిసిన వారు తెలియని వారు ఇలా ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకుంటారు. ఇతరుల బాధలను చూసి ఓర్చుకోలేరు.
కష్టకాలంలో తోడుగా ఉండే మనస్తత్వం కూడా ఉంటుంది. ఆగస్టు నెల అంటే ఎనిమిదో మాసం 8 అంటే శనికి అధిపతి ఆగస్టులో పుట్టిన వారిని డోర్ మేట్ అని కూడా అంటారు. వీరిని అందరూ ఉపయోగించుకుంటారు కానీ వీరికి ఎవరు సహాయం చేయరు. మీరు ప్రతిఫలం ఆశించకుండా శ్రమ పడతారు కష్టపడతారు. అలాగే వీరి శరీరం దృఢంగా ఉంటుంది. వీరు ఏమి తిన్నా కూడా చక్కగా అరుగుతుంది. వీరికి శని అధిపతి కాబట్టి ఆయు కారకుడు అని చెప్పే శని తత్వం వీరుపై ఉంటుంది. ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక వీరు ఒక పని అనుకుంటే దానిని సాధించే వరకు విశ్రాంతి తీసుకోరు. వీరు ఎక్కువగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు స్నేహం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మంచి మనసు మనస్తత్వం కలిగి ఉంటారు. హాస్య దృక్పథం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక అందరి దృష్టి ఎక్కువగా వీరి పైనే ఉండాలి అని భావిస్తారు. అలాగే వీరి జీవితంలో ఉన్నతంగా ఉండాలని కలలు కంటారు. అవి తీరకపోతే బాధను కలిగి ఉంటారు.

August Born peoples : ఆగస్టులో పుట్టిన జాతకులు ఇలాగే ఉంటారట… జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే…!
అయితే వీరిలో అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటే వీరికి రెగ్యులర్ ఇన్ కమ్ అనేది ఉండదు. అనుకోకుండా వీరికి కలిసి వస్తుంది. అది వ్యాపారం కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగం కూడా కావచ్చు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి లేదా అబ్బాయికి సంబంధించిన ఆస్తి కావచ్చు. ఆకస్మికంగా వీరికి డబ్బులు ఏదో ఒక రూపంలో అందుతాయి. మరి కొందరికి అయితే నిధినిక్షపాలు కూడా దొరుకుతాయి. ఈ నెలలో పుట్టిన వారికి మంచి ఆయుష్షు కూడా ఉంటుంది. కష్టపడి పైకి వస్తారు. ఆగస్టులో పుట్టిన వారు నిజాయితీపరులు. నమ్మదగిన వారు. అలాగే ఇతరులతో మర్యాదగా వ్యవహరిస్తూ ఉంటారు.