Ayyappa Swamy : అయ్య‌ప్ప‌కు మ‌ణికంఠ అనే పేరు ఎలా వ‌చ్చింది.. శ‌బ‌రి ఆల‌య నిర్మాణం ఎప్పుడు, ఎలా జ‌రిగింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ayyappa Swamy : అయ్య‌ప్ప‌కు మ‌ణికంఠ అనే పేరు ఎలా వ‌చ్చింది.. శ‌బ‌రి ఆల‌య నిర్మాణం ఎప్పుడు, ఎలా జ‌రిగింది..!

 Authored By prabhas | The Telugu News | Updated on :23 December 2022,1:20 pm

Ayyappa Swamy : శివుడు, మోహిని అయ్యప్ప ని పంబా నది వడ్డున వదిలేసి వెళ్లినాక కొద్దిసేపటికి పందల రాజు రాజశేఖరుడు వేటకి అటువైపు వెళ్తూ నది తీరంలో ఈ బిడ్డను చూస్తాడు. అయితే రాజశేఖరుడు శివ భక్తుడు. అయితే ఆయనకు పిల్లలు లేకపోవడంతో ఆ బిడ్డను శివుడి అనుగ్రహంగా భావించి తన అంతఃపురానికి తీసుకెళ్తాడు. రాజశేఖరుడు తీసుకొచ్చిన ఈ బిడ్డను చూసి రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. అయితే అయ్యప్ప వారి అంతఃపురానికి వచ్చిన వేలా విశేషం వారికి పండంటి మగ బిడ్డ కూడా పుడతాడు. అలా ఈ దంపతులు ఇద్దరు మగ బిడ్డలను పెంచుకుంటారు. ఇక అయ్యప్పకు ఈ పేరు ఎలా ఇచ్చిందంటే తనలో ఉన్న కొన్ని మంచి గుణాలను చూసి కొందరు అయ్యా అని , మరికొందరు అప్ప అని , మరికొందరు

ఈ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలవసాగారు. అలా అయ్యప్పకు ఈ పేరు వచ్చిందని అంటుంటారు. అలాగే అయ్యప్పను మణికంఠ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈ పేరు రావడానికి శివుడు మరియు మోహిని అయ్యప్ప మెడలో కట్టిన బంగారు గంట కారణం. ఆ గంట ఆధారంగానే అయ్యప్పకు మణికంఠ అనే పేరు వచ్చింది. మనీ అంటే బంగారుగంట అని అర్ధం కంఠ అంటే మెడ అని అర్థం. మెడలో ఉన్న ఈ బంగారు గంట వలనే మణికంఠ అని పేరు వచ్చింది. రాజశేఖరుడు అయ్యప్పను నది ఒడ్డున చూసిన సమయంలో ఆయన మెడలో ఉన్న గంటను చూసి మణికంఠ అని చేశాడు. అయితే రాజశేఖరుడు తన ఇద్దరి బిడ్డలకు తగిన వయసు రాగానే ఇద్దరు బిడ్డలకు విద్యలన్నీ నేర్పి వారిని మహారాజులని చేయాలని అనుకుంటాడు.

Ayyappa Swamy Sabarimala Temple History in Telugu

Ayyappa Swamy Sabarimala Temple History in Telugu

ఇంక ఈ ఉద్దేశంతో కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. కొంతకాలం విద్యను అభ్యసించిన తర్వాత కొడుకులిద్దరూ రాజ్యానికి తిరిగి వస్తారు. అయితే ఇద్దరు కొడుకులలో అయ్యప్ప పెద్దవాడు కనుక అయ్యప్ప కు పట్టాభిషేకం చేయాలని రాజశేఖరుడు అనుకుంటాడు. అయితే ఇలా చేయడం రాజశేఖరుడి భార్యకు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన కడుపున పుట్టిన బిడ్డ ఈ రాజ్యానికి రాజు కావాలని ఆమె అనుకుంటుంది. ఇక అయ్యప్ప దత్తపుత్రుడు కనుక అయ్యప్ప రాజవ్వడాన్ని ఆమె ఇష్టపడదు. దాంతో ఈ పట్టాభిషేకాన్ని ఎలాగైనా జరగకుండా ఆపాలని తనకు తలనొప్పి వచ్చినట్లుగా నాటకమాడి ఇక ఈ నొప్పి పోవడానికి పులిపాలు కావాలని వైద్యుల చేత చెప్పిస్తుంది. దాంతో అయ్యప్ప తన తల్లికి కావాల్సిన పులిపాలను

నేను తెస్తాను అని అడవికి బయలుదేరుతాడు. అయితే రాజశేఖరుడు… నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్న నీకు బదులుగా మరొకరిని పంపిద్దామని అంటాడు. దానికి అయ్యప్ప…తండ్రి నాకు రాజ్య కాంక్ష లేదు ఈ రాజ్యాన్ని సోదరునికి ఇవ్వండి అని, నాకు ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెబుతాడు. అయితే ఆ ఆలయాన్ని ఎక్కడ కడతారంటే నేను ఒక బాణాన్ని ఇక్కడ నుండి సంధిస్తాను ఇక ఆ బాణం ఎక్కడికైతే వెళ్లి పడుతుందో అక్కడ నాకు ఆలయంని నిర్మించమని కోరుతాడు. అందుకు రాజశేఖరుడు అంగీకరిస్తాడు. అలా ఆరోజు అయ్యప్ప వదిలిన బాణం వెళ్లి శబరిమల కొండపై పడుతుంది. ఇక అక్కడ అయ్యప్పకు ఆలయం కట్టిస్తారు. ఇది శబరిమల ఆలయ నిర్మాణం వెనుక ఉన్న అసలు కథ.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది