Chanakya Neeti : మీ క్లోజ్ ఫ్రెండ్‌కు కూడా ఈ విషయాలు అస్సలు షేర్ చేయొద్దంటున్న చాణక్యుడు.. ఎందుకంటే?
Chanakya Neeti : మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలన్నిటినీ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. గొప్పవ్యూహకర్త అయిన చాణక్యుడు తన నీతి శాస్త్రంలోని విషయాలను ఫాలో అయితే కనుక ఎటువంటి ఇబ్బందులనైనా అధిగమించొచ్చని పెద్దలు వివరిస్తున్నారు. ప్రజెంట్ జనరేషన్‌లో ఎదురయ్యే సమస్యలన్నిటినీ చాణక్యుడు తన నీతి గ్రంథంలో వివరించాడు. ఆయన చెప్తున్న సూత్రాల ప్రకారం.. ఈ విషయాలను మీ క్లోజ్ ఫ్రెండ్ వద్ద కూడా అస్సలు షేర్ చేసుకోవద్దట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా విషయాలను మనం స్నేహితుల వద్ద పంచుకుంటుంటాం.
అలా మన విషయాలను పంచుకున్నట్లయితే మనసు తేలికవుతుందని భావిస్తుంటాం. నిజంగానే తేలిక అవుతుంది కూడా. అయితే, అలా అని చెప్పే అన్ని విషయాలనూ షేర్ చేయొద్దట. ముఖ్యంగా ఈ విషయాలను ఎంత దగ్గరి స్నేహితుడు అయినా అస్సలు షేర్ చేయొద్దని చాణక్యుడు తన నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. వాటిని షేర్ చేయడం ద్వారా ఫ్యూచర్‌లో ఇబ్బందులొస్తాయని తెలిపాడు.కొన్ని విషయాలను ఎప్పుడైనా గోప్యంగా ఉంచుకోవాలి. అలా ఉండటం వల్లే గౌరవం ఉంటుంది. మన ఎకానమికల్ కండీషన్‌ను ఎంతటి క్లోజ్ ఫ్రెండ్ అయినా చెప్పొద్దు.
Chanakya Neeti : ఈ విషయాలు చెప్తే.. ఇక అంతే సంగతులు..
బంధువుల వద్ద కూడా మీ విషయాలను అస్సలు పంచుకోవద్దు. ఒక వేళ మీ ఇబ్బందులను వారితో షేర్ చేసుకున్నట్లయితే రేపు ఒక వేళ మీ మధ్య బంధుత్వం తెగిపోతే ఆ ఇష్యూతో వారు మిమ్మల్ని ఎగతాళి చేయొచ్చు. ఇకపోతే మీ వైఫ్ గుణం, మంచి, చెడుల గురించి ఎప్పుడూ ఎవరి వద్ద ప్రస్తావించకూడదు. అలా ప్రస్తావించనట్లయితే భవిష్యత్తులో మీ ఇంటిలో సమస్యలు మరింత పెరిగే అవకాశాలుంటాయి. ఇక మీ జీవితంలో ఎదురైన అవమానాలను కూడా మీ లోని దాచుకోవాలి. ఆ అవమానం గురించి ఎదుటి వారితో చర్చించినట్లయితే అది మీ గౌరవం పై ఎఫెక్ట్ చూపుతుంది. మీకు దాని ద్వారా ఇబ్బందులు కూడా వచ్చే చాన్సెస్ ఉంటాయి.