Chanakya Neeti : ఈ 5లక్షణాలు మీలో ఉంటే మీరు జీవితంలో 100% గొప్పవారవుతారు..!!
Chanakya Neeti : ప్రస్తుత రోజుల్లో గొప్పవారు అవడానికి చాలామంది దొడ్డిదారులు వెతుకుతున్నారు. దీంతో చేయకూడని పనులు చేసి.. సమాజంలో నవ్వులు పాలవుతున్నారు. అయితే అపార జ్ఞానుడు చాణిక్య గొప్పవారు అవటానికి చెప్పిన ఐదు విషయాలు గురించి తెలుసుకుందాం. కచ్చితంగా ఐదు లక్షణాలు చేపడితే ప్రతి పనిలో విజయవంతం కావడంతో పాటు సమాజంలో గొప్పవారుగా కీర్తించబడతారు. చాణిక్యుడు చెప్పిన ఆ ఐదు లక్షణాలు చూస్తే మొదటిది కష్టపడి పనిచేసే తత్వం. మనిషి ఎప్పుడూ కూడా కొన్ని విషయంలో కష్టపడి చేసే తత్వం ఉండాలి. ఫలితం గురించి అసలు ఆలోచించకుండా.. చేతి కంది వచ్చిన పని మొత్తం చేసుకుంటూ పోవాలి.
మనిషి ఎదుగుదలకు శ్రమకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. బద్ధకం, నిర్లక్ష్యం, పనిని వాయిదా వేయటం వంటివి దరి చేరనీవ్వకూడదు. ఇక రెండోది చూస్తే… ఆత్మవిశ్వాసం. మనిషి జీవితంలో ప్రతి వయసులో ఆత్మవిశ్వాసం అనేది చాలా కీలకము. తనపై తనకి ఆత్మవిశ్వాసము ఉంటే ఎన్ని సవాలైనా ఎదుర్కోవచ్చు.. ఎటువంటి కష్టమైన పనులైన సులువుగా మార్చుకోవచ్చు. ఇక మూడోది జ్ఞానం. మనం ఏ రంగంలో అయితే స్థిరపడాలి అని అనుకుంటామో… ఆ రంగానికి సంబంధించిన జ్ఞానం పూర్తిగా సంపాదించాలట. మనిషి తాను సంపాదించుకున్న జ్ఞానం ఎప్పుడూ కూడా వృధా కాదు. జ్ఞానం ఏ రకంగా సంపాదించిన అది మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని చాణిక్యుడు చెబుతారు. ఇక నాలుగోది డబ్బు సంపాదన. మానవ జీవితం ఎక్కువగా డబ్బుతోనే ముడి పడింది.
ఎవరైనా జానెడు పొట్ట కోసం కష్టపడుతూ ఉంటారు. మానవ జీవితంలో మంచి చెడులు ఎప్పుడు వస్తూ ఉంటాయి. కనుక కచ్చితంగా మనిషి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బులు ఉండాలి అని చాణిక్యుడు చెబుతారు. కష్టమైన సమయంలో డబ్బు చాలా ఆదుకుంటుందని అంటారు. అంతేకాదు సంపాదించిన డబ్బు ఎలా పడితే అలాగా ఖర్చు చేయకూడదు. ఆపద సమయంలో చాలావరకు మన అనుకునే వాళ్ళు చేతులెత్తేస్తారు. ఆ సమయంలో డబ్బే కాపాడుతుందని చాణిక్యుడు చెబుతుంటారు. ఐదవది ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. విజయాలు ఎక్కువయ్యే కొద్ది శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. దీంతో వచ్చే ప్రతి పన్నాగాన్ని… కనిపెట్టేలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెబుతారు. 5 లక్షణాలు ఉంటే కచ్చితంగా గొప్పవారు అవుతారని చానిక్యుడు తన శాస్త్రంలో తెలియజేయడం జరిగింది.