Chanakyaniti : చాణక్యనీతిలో దానధర్మాల విశిష్టత… ఏ వస్తువులు ఎప్పుడు దానం చేస్తే విశేష పలితాలు వస్తాయి…!
ప్రధానాంశాలు:
Chanakyaniti : చాణక్యనీతిలో దానధర్మాల విశిష్టత... ఏ వస్తువులు ఎప్పుడు దానం చేస్తే విశేష పలితాలు వస్తాయి...!
Chanakyaniti : చాణక్య నీతిలో దాన ధర్మానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి వ్యక్తి తన ఆర్థిక పరిస్థితిని బట్టి జీవితాన్ని గడుపుతుంటారు. అదేవిధంగా తన సామర్థ్యాన్ని బట్టి దానాలు చేయాలి అని సనాతన ధర్మం యొక్క నమ్మకం. చాణిక్యుడు నీతిలో దీని గురించి వివరంగా చెప్పబడింది. దానం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఎవరికి దానం చేయాలి..? ఏ వస్తువులను దానం చేయాలి..? అనే విషయాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ దానం చేయడం చాలా అవసరం. చాణక్య నీతిలో దాన ధర్మం గొప్ప ప్రాముఖ్యత ఉంది. చాణుక్యుడు చెప్పిన ప్రకారం.
ప్రతి వ్యక్తి తన శక్తి సామర్థ్యానికి తగ్గట్టుగా దానలను చేయాలి. దానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది. అలాగే దీని వలన ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. ముఖ్యంగా జీవితంలో ఆనందం, శ్రేయస్సు వంటివి లభిస్తాయి. దానం చేసేటప్పుడు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. అయితే దానం చేసే అలవాటును పెంచుకోవడం చాలా మంచిది. దానాన్ని ఎప్పుడైనా సరే అవసరంలో ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలి. అవసరం లేని వారికి ఎప్పుడు దానం చేయకూడదు. ముఖ్యంగా డబ్బును దుర్వినియోగం చేసే వారికి దానం అస్సలు ఇవ్వకూడదు. అదేవిధంగా దురాశ పరులకు మరియు స్వార్థ పరులకు దానం చేయడం మంచిది కాదు. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి దేవాలయాలకు లేదా సంస్థలకు విరాళాలు కూడా ఇవ్వచ్చు.
Chanakyaniti ఏం దానం చేయవచ్చు
గోవును నెయ్యి దానం చేయవచ్చు. అలాగే వస్త్రం, నువ్వులు మరియు బెల్లం దానం చేయడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. వీటిని దానం ఇవ్వడం పవిత్రమైనదిగా భావిస్తారు.
దానం చేయకూడని వస్తువులు.
స్టీల్ వస్తువులను దానంగా ఇవ్వకుడదు. అలాగే స్టీల్ వస్తువులు దానం ఇవ్వడం వలన సంపద మరియు ఆనందాన్ని కోల్పోతారు. మరి ముఖ్యంగా హిందూ మతంలో గోవు దానం అనేది అత్యుత్తమ దానంగా పరిగణిస్తారు.