Diwali : దీపావళి ఐదు రోజులు పండగ… ఏ పండగ ఏ రోజు జరుపుకోవాలి… ప్రాముఖ్యత ఏమిటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diwali : దీపావళి ఐదు రోజులు పండగ… ఏ పండగ ఏ రోజు జరుపుకోవాలి… ప్రాముఖ్యత ఏమిటి..?

 Authored By prabhas | The Telugu News | Updated on :15 October 2022,6:00 am

Diwali : హిందూ సాంప్రదాయాలలో ఎంతో ఉత్సాహంగా ఘనంగా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ దీపావళిని హిందువులే కాకుండా బౌద్ధ, సిక్కు, జైన మతాలు వారు కూడా ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గోవర్ధన పూజ, దీపావళి, నరక చతుర్దశి, దన్ తెరాస్, సోదరీడు, సోదరీమణులు పండగ తో మొత్తం ఐదు పండగలు దీపావళిగా జరుపుకుంటూ ఉంటారు. కార్తీక మాసంలో కృష్ణ పక్షంలోని త్రయోదశి నుంచి కార్తిమాసంలోని శుక్లపక్షం రెండవ నాడు కూడా జరుపుకుంటారు. ఈ దీపావళికి సంబంధించిన ఐదు ముఖ్యమైన పండుగలను దీపాల పండుగ అని కూడా అంటూ ఉంటారు. చీకటిపై కాంతి విజయానికి గుర్తుగా వెలువడింది. దీపావళి పూజకు సంబంధించిన విశిష్టత గురించి ఆచార నిపుణుడు మరియు జ్యోతిష్కుడు పిటి రామ్ కి గణేష్ మిశ్రా తెలియజేసిన విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం… ఈ సంవత్సరం 22 అక్టోబర్ నా దీపావళి పండుగ దన్ తేరస్ తో మొదలవుతుంది. ఇది సంపదలకు దేవతగా లక్ష్మీదేవిగా కుబేరునిగా ఆరోగ్య దేవతగా ఆరాధించే దనంతర పూజకు ఎంతో విశిష్టత ఉంది.

ఈ ఆరాధన చేయడం వలన ఆహారం సంపదతో పాటు ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని కూడా కలుగుతుందని భావిస్తూ ఉంటారు. ఈనాడు శివుని అనుగ్రహం కోసం వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. రెండో రోజు దీపావళి నరక చతుర్దశి లేక చోటి దీపావళిగా జరుపుకుంటారు. ఈ పండగ ఈ ఏడాది 23 అక్టోబర్ ను జరుపుకుంటా రు. నరక చతుర్దశి నాడు సాయంత్రం గృహం బయట స్పెషల్ గా దీపాన్ని వెలిగిస్తే నరకానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అలాగే హనుమంతుడు కూడా నరక చతుర్దశి నాడు పుట్టాడని కొందరు విశ్వాసం. అలాంటి పరిస్థితుల్లో హనుమాన్ భక్తులు ఈనాడు ముఖ్యంగా సాధనతో హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఈ పండుగ నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి అభ్యంగ స్నానాలు ఆచరించడం వలన ఆరోగ్యం అందం పెరుగుతుందని విశ్వాసం. దీపాలతో కూడుకొని ఉన్న ప్రత్యేక పండుగ దీపావళి. ఈ ఏడాది 24 అక్టోబర్ న దీనిని జరుపుకుంటారు. ఆ నాడు కార్తీక మాసంలోని అమావాస్య తేదీ సాయంకాలం ఐదు గంటల 30 నిమిషాల నుండి మొదలవుతుంది.

Diwali is a five day festival which festival should be celebrated on any day

Diwali is a five-day festival which festival should be celebrated on any day

ఈ గొప్ప దీపావళి పండుగ రోజు శ్రేయస్సు ఆనందమును ఇచ్చే వినాయకుడిని సంపద దేవత గుర్తుగా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు.  ప్రత్యేకమైన దీపావళి పండగ నాడు గణేశుడిని లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా ఇంట్లో ధనం ఆహార ధాన్యాల లోటు ఉండదని భావిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన దీపావళి పండగ రోజున కాళికాదేవిని కుబేరున్ని పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. ఇక దీపావళి మరునాడు పాడ్యమి దీపాలు వదిలితూ ఉంటారు. గోవర్ధన పూజ కూడా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది రెండవ నాడు సూర్యగ్రహణం ఉండడం వలన ఈ పండుగని అక్టోబర్ 26న జరుపుకుంటున్నారు. గోవర్ధన పూజ రోజున గోవర్ధన పర్వతం ఆవు పూజకి చాలా ప్రత్యేకత ఉన్నది. దీపావళి ప్రత్యేకమైన ఐదోవ నాడు సోదరుడు, సోదరీమణుల పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ అన్నదమ్ముల ప్రేమకి గుర్తుగా నమ్మే ఈ పండుగను ఈ ఏడాది 27 అక్టోబర్ న జరుపుకుంటున్నారు. ఈనాడు అక్క చెల్లెలు తమ అన్నలకి దీర్ఘాయు ప్రసాదమించమని ప్రత్యేక ఆరాధన చేస్తూ ఉంటారు. అన్నలు తమ చెల్లెళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి వారిని ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది