Food : పొయ్యి వెలిగించకుండా నూనె వాడకుండా అద్భుతమైన భోజనం.. ఎలాగో తెలుసా..?
Food : మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే నూనె లేకుండా చేయలేము.. అలాగే పొయ్యి వెలిగించకుండా కూడా చేయలేము.. అయితే ఒక ప్రదేశంలో నూనె వాడకుండా పోయి వెలిగించకుండా అద్భుతమైన భోజనం తయారు చేస్తున్నారట.. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. ఓ వ్యక్తి తన రెస్టారెంట్లో నో బాయిల్ నో ఆయిల్ అనే క్యాప్షన్ తో అద్భుతమైన వంటలను ప్రిపేర్ చేస్తున్నారు.. తమిళనాడులో కోయంబత్తూర్ కి చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఈ వంటలన్నీ ఆయిల్ లేకుండా పోయి వెలిగించుకున్న ప్రిపేర్ చేస్తున్నారు.. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సహజంగా రెస్టారెంట్లు రకరకాల ఫుడ్ కలర్స్ కలిపి ఎన్నో మసాలాలు వేసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి చాలామంది నాణ్యతలేని నూనెను వాడుతూ ఉంటారు. ఇటువంటి కల్తీ భోజనం తినడం వల్లనే అలర్జీ, గుండె జబ్బులు ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉన్నాయి.. ఇటువంటి కల్తీ ఆహారానికి చెక్ పెట్టాలని శివకుమార్ అనే అతను నో బాయిల్ నో ఆయిల్ అనే క్యాప్షన్ తో మంచి అద్భుతమైన ఆహారాన్ని అందిస్తున్నాడు.. ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన ఆహారం తినాలని ఉద్దేశంతో ఈ ఆహార పదార్ పద్ధతిని ఎంచుకున్నాడు..
ఇంకొక విషయం ఏమిటంటే ఈ రెస్టారెంట్లో పచ్చి పసుపు, పచ్చళ్ళు, చింతపండు 12 గంటలు నానబెట్టి కొబ్బరి పాలు లాంటి ఐటమ్స్ వేస్తూ ఉంటారు. సుమారు 4 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి రెస్టారెంట్ ను నడుపుతున్నారు. ప్రజలు కూడా ఈ రెస్టారెంట్లో తినడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు..
ఈ శివకుమార్ అనే అతనికి చిన్నప్పటినుంచి వంటలు మీద మక్కువ ఎక్కువ.. ఎప్పుడు కూడా రకరకాల వంటలు చేస్తూ అందరిని మైమరిపించేవాడు ఇతను మాంసం ముట్టేవాడు కాదట.. ఆయిల్ లేకుండానే వంటలు ఏ విధంగా చేయాలో శిక్షణ తీసుకొని సుమారు 3000 కొత్త వంటకాలను కనుగొన్నాడు. ఆ తర్వాత సొంతంగా ఓ రెస్టారెంట్ ని ప్రారంభించడం జరిగింది.. ఇలా ఎన్నో రకాల ఆహారాలను నూనె లేకుండా తయారుచేసి అందర్నీ మైమరిపిస్తున్నాడు..