Ugadi Festival : ఈ ఉగాది పండుగ రోజున ఏ దైవానికి పూజ చేయాలో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ugadi Festival : ఈ ఉగాది పండుగ రోజున ఏ దైవానికి పూజ చేయాలో తెలుసా..?

Ugadi Festival : హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం ఉగాది పండుగనాడు ఏ దైవాన్ని పూజిస్తారో మనం తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అనేది కొందరిలో సందేహం. ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్టమైన దైవాన్ని ఆ కాలపురుషునిగా తలచి పూజించాలి. శ్రీమహావిష్ణువు శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి. ఉగాది […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ugadi Festival : ఈ ఉగాది పండుగ రోజున ఏ దైవానికి పూజ చేయాలో తెలుసా..?

Ugadi Festival : హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం ఉగాది పండుగనాడు ఏ దైవాన్ని పూజిస్తారో మనం తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అనేది కొందరిలో సందేహం. ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్టమైన దైవాన్ని ఆ కాలపురుషునిగా తలచి పూజించాలి. శ్రీమహావిష్ణువు శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి. ఉగాది పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు నుండి సృష్టి మొదలైందని నమ్మకం. అందుకే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యగ్న స్నానం చేస్తారు.

Ugadi Festival : ఉగాది పండుగ రోజు ఏ పూజ చేయాలంటే..

అనంతరం ఉతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు రాసి కుంకుమను అద్ది. గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు. ఇంటిముందు రంగవల్లితో తీర్చిదిద్దారు. ఉగాది తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగలో ఒకటి. తెలుగువారు కొత్త సంవత్సరం ఉగాది ఆ రోజు నుండి తెలుగు క్యాలెండర్ ప్రారంభమవుతుంది అని అర్థం. ఉగాది పండుగ వస్తుందంటే చాలు. పచ్చని పచ్చంగా శ్రావణం కోయల్లో గుర్తుకొస్తాయి. ఈ రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని అందుకే మంచి పనులు చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడి కి వైద్య పరంగా విశిష్టమైన గుణం ఉంది.

Ugadi Festival ఈ ఉగాది పండుగ రోజున ఏ దైవానికి పూజ చేయాలో తెలుసా

Ugadi Festival : ఈ ఉగాది పండుగ రోజున ఏ దైవానికి పూజ చేయాలో తెలుసా..?

ఈ ఉగాది పచ్చడిని ఇంటిలోని కుటుంబ సభ్యులందరికీ అందించాలి. ఉగాది రోజున పెద్దలు పంచాంగ శ్రవణాన్ని వినడానికి శ్రద్ధ చూపిస్తారు. రానున్న రోజుల్లో తమ జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. తెలుగు సంవత్సరపు మొదటి రోజైన ఉగాదినాడు పంచాంగం విని తీరాలని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది రోజున ప్రధానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు. పెద్దలు వేసవికాలంలో ఎండలు మొదలవుతాయి. ఈ నియమం పెట్టినట్లు తెలుస్తుంది. సూర్యుడు తాపాన్ని ఎదుర్కొనేందుకు మంచినీటితో దాహం తీర్చడమే దీని అర్థం.. ఉగాది రోజున కొందరు చెప్పులు, గొదుగులను కూడా దానం చేస్తారు. ఉగాది తెలుగువారికి నూతన సంవత్సర ప్రారంభ దినం కొత్త పనులు చేపట్టమని పెద్దలు సూచిస్తున్నారు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది