Ugadi Festival : ఉగాది పండుగని ఏ రాష్ట్రాల వారు ఎలా జరుపుకుంటారో తెలుసా?
Ugadi Festival : కేవలం తెలుగు ప్రజలకే కాదు… భారతీయులందరికీ ఉగాది చాలా పెద్ద పండుగ. అతి ముఖ్యమైన పండుగ కూడా. తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవడంతో ఈ పండుగ ప్రారంభం అవుతుంది. అయితే తెలుగు వారంతా ఈ పండుగను చాలా ఘనంగా చేసుకుంటారు. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాదిని పండుగను నిర్వహించుకుంటారు. అయితే మన దేశంలోని పలు చోట్ల కూడా ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. కానీ పేర్లు కాస్త వేరుగా ఉంటాయి. అయితే ఏ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Ugadi Festival : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్..
ఉగాది పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చాలా బాగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తిన రోజు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఉగాది పండుగ రోజున తెలుగు వారంతా ఉదయమే ఆలయాలకు వెళ్తారు. ఇంటిని ప్రత్యేకంగా అలంకరించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే వివిధ రకాల పిండి వంటలను తయారు చేసుకుంటారు. అందులోనూ ముఖ్యంగా షడ్రుచులతో పచ్చడి తయారు చేస్తారు. ఈ వంటకం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. అయితే కొన్ని చోట్ల ఈ పచ్చడని పలుచగా అంటే పానకంలా చేస్తే… మరికొందరు గట్టిగా చేస్తుంటరు. అయితే ఈ పచ్చడని రుచి చూసిన తర్వాత పంచాగ శ్రవణం చేస్తారు.
Ugadi Festival : కర్ణాటక
కర్ణాటకలో ఉగాది పర్వదినం రోజున చైత్ర నవరాత్రి ప్రారంభం అవుతుంది. తెలుగు ప్రజల లాగానే కర్ణాటక వాళ్లు కూడా ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల్లో పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. అలాగే ఈ నవరాత్రుల్లో చివరి రోజుని శ్రీ రామ నవమిగా జరుపుకుంటారు.
Ugadi Festival : మహారాష్ట్ర
తెలంగాణ రాష్ట్రం పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఉగాది పండుగను గుడి పద్వాగా నిర్వహించుకుంటారు. అయితే చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ దేవుడు ఈ సృష్టిని సృష్టించాడని మహారాష్ట్ర ప్రజలు నమ్మకం. అలాగే ఇదే రోజు సత్య యుగం ప్రారంభం అయిందనే నమ్మకంతో వివిధ రకాల ఆచార సంప్రదాయాలను పాటిస్తారు. మనం సంక్రాంతి పండుగకు వేసుకున్నట్లుగా వారి ఇంటి ముందు అందమైన రంగ వల్లులను వేసి అందంగా అలంకరిస్తారు. ఆ తర్వాత స్వీట్లు తయారు చేసుకొని పండుగను ఆనందంగా జరుపుకుంటారు.