Shivratri : శివరాత్రి నాడు అస్సలే ఈ పనులు చేయకూడదు..!
Shivratri : భారత దేశంలో మహా శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే ఫాల్గుణ మాసంలో వచ్చే ఈ మహా శివరాత్రి కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అంతేనా ఉపవాసం లేని వాళ్లు అయితే.. సోమ వారం రోజు శివరాత్రి వస్తే బాగుండని చూస్తారు. ఒకవేళ ఏ ఏడాది అయినా మహాశివ రాత్రి సోమవారం వచ్చిందంటే చాలు చాలా మంది ఆనాటి నుంచే ఉపవాసం ప్రారంభిస్తారు. ఈ పరమ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు జాగారాలు పెద్ద ఎత్తున చేస్తుంటారు. అయితే మహాశివరాత్రి రోజునే మహా శివుడు.. పార్వతీ దేవిని వివాహం చేసుకున్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ సంవత్సరం మహా శివరాత్రి పండుగ మార్చి ఒకటవ తేదీన వస్తోంది. అయితే ఆ రోజున ఈ మహేశ్వరుడికి ఇష్టమైన రుద్రాభిషేకం చేయడం
వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అంతే కాకుండా ఈ రోజు భోళా శంకరుడికి ఇష్టమైన వాటిని శివ లింగానికి సమర్పించడం వల్ల అనేక రోగాలు తొలగిపోతాయట. కొందరు ఏమేం సమర్పించాలో తెలియక తమకు తెలిసన వాటిని పెడ్తూ… పూజాఫలాన్ని పొందకుండా చేసుకుంటారు. అయితే మహా శివరాత్రి నాడు శివలింగానికి అస్సలే సమర్పించకూడని కొన్నింటికి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి అభిషేకం ఇష్టమైనందును చాలా మంది బిల్వార్చన చేస్తుంటారు. అయితే ఇందులో చాలా రకాలు ఆకలను వాడుతుంటారు. కానీ తులసి ఆకులను శివలింగానికి అస్సలే సమర్పించకూడదట. అలాగే అభిషేకంలో భాగంగా పాలను వాడుతుంటాం.
అయితే శివలింగానికి పాశ్చరైజ్డ్ లేదా ప్యాకెట్ పాలను కూడా అస్సలే సమర్పించకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు చల్లటి పాలను మాత్రమే స్వామికి సమర్పించాలి.పంచామృతాలతో ఆ శివ లింగాన్ని అభిషేకిస్తే… కోరిన కోరికలు నెరవేరుతాయి. మహా శివరాత్రి నాడు భక్తి, శ్రద్ధలతో ఉపవాసం ఆచరించి, పూజలు చేయడం వల్ల ఆ పరమ శివుడు అనుగ్రహిస్తాడు. అయితే మహాశివరాత్రినాడు ఉపవాసం, జాగారం చేసి మరుసటి రోజు స్నానం చేశాక… ఉపవాస దీక్షను విరమించాలి. అయితే ఈసారి మహా శివరాత్రి మార్చి 1 మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు మొదలవుతోంది. మార్చి 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు మహాశివరాత్రి ముగియనుంది.