Festivals : ఈ నెలలో రాబోయే పండుగలు, వ్రతాల వివరాలివే.. ఓసారి చూడండి!
Festivals : తెలుగు క్యాలెండర్, సంప్రదాయాల ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే జూన్ నెలకు కూడా ఎంతో విశిష్టత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, మూడో నెల అయిన జ్యేష్ఠ మాసం ఈ నెలలోనే వస్తుంది. ఈ నెలలో నిర్జన ఏకాదశి, గంగా దసరా, జగన్నాథ రథయాత్ర వంటి ముఖ్యమైన పండుగలతో పాటు ఇతర వ్రతాలను కూడా హిందువులు ఈ నెలలో జరుపుకుంటారు. అయితే 2022వ సంవత్సరం జూన్ మాసంలో ఏయో రోజుల్లో ఏయే పండుగలు రానున్నాయి, ఏ రోజున ఏ వ్రతం చేస్తే మంచిదనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రంభ తృతీయ... గత మాసంలో అక్షయ తృతీయ ముగిసింది. ఈ నెలలో రంభ తృతీయ జూన్ రెండో తేదీన గురువారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు మరియు పిల్లల శ్రేయస్సు కోసం వ్రతం చేస్తారు. అంతే కాదు ఉపవాసం కూడా ఉంటారు. హింధూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో తృతీయ తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
గంగా దసరా… గంగా దసరా పండుగను జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని పదో రోజున జరుపుకుంటారు. ఈరోజున గంగా మాతాను పూజించడం, గంగా స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ పండుగ జూన్ 9వ తేదీన రాబోతుంది.
నిర్జల ఏకాదశి… హిందూ మత విశ్వాసం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం నిర్జన ఏకాదశి జూన్ 11వ తేదీన వచ్చింది.
కబీర్ జయంతి, సావిత్రి వ్రతం.. మన దేశంలోని చాలా ప్రాంతాల్లో జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో పౌర్ణమి రోజున సావిత్రి ఉపవాసం వ్రతాన్ని ఆచరిస్తారు. అలాగే జూన్ 14వ తేదీన కబీర్ జయంతిని జరుపుకుంటారు.
యోగిని ఏకాదశి.. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఏకాదశి ఉపవాసం యోగిని ఏకాదశిని సుక్ల పక్షంలో జరుపుకుంటారు.
మాస శివరాత్రి… ప్రతి నెలా క్రిష్ణ పక్షంలో చతుర్దశి తిథఇని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అయితే జూన్ మాసంలో 27వ తేదీన మాస శివరాత్రి వచ్చింది. అలాగే జూన్ 30న జగన్నాథ రథయాత్ర జరగనుంది.