Vaccine : టీకా తీసుకున్నా కరోనాతో చనిపోయిన దేశంలోనే తొలి వ్యక్తి..!
Vaccine : మన దేశంలో కరోనా వైరస్ బారి నుంచి కాపాడటానికి ప్రస్తుతం రెండు టీకాలను విరివిగా వాడుతున్నారు. ఒకటి.. కొవాగ్జిన్. రెండు.. కొవిషీల్డ్. ఈ రెండు వ్యాక్సిన్ల రెండు డోసులను ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు. అయినప్పటికీ కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. టీకా వికటించటం వల్ల గానీ లేక కొవిడ్ అనంతర అనారోగ్య పరిస్థితుల వల్ల గానీ చనిపోతున్నారు. అయితే వాళ్లను ప్రభుత్వం ఇన్నాళ్లూ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ రోజు మంగళవారం ఒక వ్యక్తిని ఈ మరణం కింద అధికారికంగా నమోదు చేశారు. మార్చి 8వ తేదీన 68 ఏళ్ల ఒక వ్యక్తి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఈ మధ్య తుది శ్వాస విడిచాడు. దీంతో అతను టీకా వికటించటం వల్ల కన్నుమూసినట్లుగా మెడికల్ రిపోర్టుల్లో నమోదు చేశారు. కాకపోతే అతని పేరు, ఊరు వంటి వివరాలేవే వెల్లడించలేదు.
ఎంతో మంది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్వీ ప్రసాద్, ఆయన సతీమణి లక్ష్మి ఇటీవల కొవిడ్ వల్ల చనిపోయారు. వాళ్లు కూడా కరోనా టీకా రెండు డోసులు వేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఎస్వీ ప్రసాద్ దంపతులే కాదు. వాళ్ల ఇద్దరు కొడుకులు కూడా కరోనా సోకి ఆస్పత్రి పాలయ్యారు. బీజేపీ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఆ మహమ్మారి అంటుకుంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా ఎంతో మందిని టీకా తీసుకున్నా కరోనా కాటేస్తోంది.

Governament declared first death after corona vaccination
మాస్క్ పెట్టుకోవాల్సిందే.. : Vaccine
రెండు డోసుల కరోనా వ్యాక్సినేషన్ వేయించుకున్నా మూతికి, ముక్కుకి మాస్క్ పెట్టుకోవాల్సిందేనని, భౌతిక దూరం పాటించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. టీకాలు వేయించుకున్నా కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతుందని, అయితే టీకా వల్ల ప్రాణాపాయం తప్పుతుందని అంటున్నారు. డాక్టర్లు చెప్పే ఈ విషయాలకు, వాస్తవాలకు మధ్య పొంతన కుదరట్లేదు. వ్యాక్సిన్ వేయించుకున్నా జనం రాలిపోతున్నారు. కాబట్టి టీకాల సామర్థ్యంపై సహజంగానే సందేహాలు వస్తాయి. వ్యాక్సినేషన్ అనంతరం కూడా చనిపోతున్నట్లు ప్రభుత్వం తాజాగా గుర్తిస్తోందంటే బాధిత కుటుంబాలకు ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తుందేమో చూడాలి.