Health Tips : రోజు ఉదయం నానబెట్టిన శనగలు తినడం వలన మీ శరీరంలో జరిగేది ఇదే..!!
Health Tips : సింపుల్ గా అనిపించే ఒక విషయాన్ని మీతో షేర్ చేయబోతున్నాను.. అదే సెనగలు ఎలా తింటే మనకి ఆరోగ్యము ఇది కూడా చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది. కదా మీకు సెనగలు ఏంటి ఏదో విధంగా ఎలా అయినా తినొచ్చు కదా.. అని నిజానికి సెనగలు ఎప్పుడు ఎలా తింటే మన శరీరానికి ఎటువంటి ప్రయోజనాలు అందుతాయి. అనే విషయాలు చాలా మందికి తెలియదు.. కాబట్టి సెనగలే కదా ఎలా తిన్నా ఉపయోగముంటుంది. కదా అని అనుకోకుండా ఇప్పుడు చెప్పే విధంగా మీరు సెనగల్ని గనుక తింటే మీ శరీరం ఉక్కు లాగా ఉంటుంది. అలాగే మీ శరీరానికి అందవలసిన ప్రోటీన్స్ అలాగే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా సమపాళ్లలో మీకందితీరతాయి. కాబట్టి శనగలను ఎలా తినాలి? ఎప్పుడు ఎంత మోతాదులో తినాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. కొందరు శనగలతో కూరలు చేస్తారు అయితే ఎలా తీసుకున్నప్పటికీ శనగలతో మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
మాంసం తినలేని వారికి సెనగలు అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు.. ఎందుకంటే సెనగలలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. నిత్యం ఒక కప్పు శనగలను తినడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి. శనగల తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శనగలను మొలకల రూపంలో తిన్న కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. బాదంపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అన్ని ప్రయోజనాలు ఉడికించిన శనగల్లో ఉంటాయి. శనగలను వారానికి రెండుసార్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సూపర్ గా పనిచేస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది.నాన్ వెజ్ తినని వారికి సెనగలు ఒక దివ్య ఔషధమని చెప్పొచ్చు. కాబట్టి నాన్ వెజ్ తిననివారు శనగల తింటే చాలు..
కొన్ని అధ్యయనాల్లో తేలిన విషయం ఏంటంటే సెనగలు తీసుకొని వారి కంటే శనగలు తీసుకున్నవారు త్వరగా బరువు తగ్గుతారని తేలింది. సమానమైన కాల్షియం సెనగల్లో ఉంటుంది. 100 గ్రాముల సెనగలను తీసుకోవడం ద్వారా ఏమి లభిస్తాయి అంటే 164 మిల్లీగ్రాముల క్యాలరీస్ 8. గ్రాములు ఐరన్ 2.8 గ్రాములు ఉంటుంది కనుక సెనగలే కదా అని తీసి పడేయకుండా మీ ఆహారంలో పెట్టిన చేర్చుకుని ఎన్నో లాభాలు పొందండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులో ఒక గుప్పెడు వరకు సెనగలు వేసి శుభ్రంగా కడిగి ఆ నీళ్లు పడబోసి మళ్లీ డ్రింకింగ్ వాటర్ శనగలు మునిగే వరకు వేసి రాత్రంతా నాన్ననివ్వండి. ఉదయం ఇలా నానిన శనగలు తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అవి కూడా చూద్దాం.. ఇలా రాత్రంతా నారిన సెనగలు తినడం వల్ల శరీరంలో రోక నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాల వ్యాధులను రక్షించడానికి సహాయపడుతుంది.