Himalaya Jyotirlinga Temple : హిమాలయాలలో వెలసిన జ్యోతిర్లింగ విశేషాలు ఇవే !
Himalaya Jyotirlinga Temple : జ్యోతిర్లింగాలలో ఒక్కోక్కటి ఒక్కో విశేషం. దీనిలో హిమాలయాలలో వెలసిన ఏకైక జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం చార్ధామ్ యాత్రలో ప్రముఖమైనదిగా పేర్కొంటారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం…
Himalaya Jyotirlinga Temple : పురాణగాథ
ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అత్యంత నిష్ఠాగరిష్టులై తపస్సు చేస్తున్నారు. వారు కేదార క్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సును మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగ రూపంలో వెలసి, జనులను గర్భవాస నరకము నుంచి తొలగించి ముక్తిని ప్రాసాదించమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది.
Himalaya Jyotirlinga Temple : విశేషాలు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది. దీపావళి రోజున స్వామికి నేతితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునేలలపాటూ ఆలయం మూసి ఉన్నసమయంలో కొండ దిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఈ క్షేత్రాన్ని నరనారాయణులు, పంచపాండవులు, ఉపమన్యు మహర్షి, ఆదిశంకరుల వారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి.
Himalaya Jyotirlinga Temple : దేవాలయంలో చూడాల్సిన ప్రదేశాలు !
ఇక్కడ ఆమవారైన కేదార గౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాడవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హింసకుండం, ఉదక కుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చెసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చొట్ల నుండి సీసాలలొ గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చెయిస్తుంటారు.