Lord Shiva : శివుడిని సోమవారం నాడు ఇలా పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం !
Lord Shiva : శివుడు.. సర్వమంగళ స్వరూపుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈ జగత్తులో ఏదీ జరుగదు. అలాంటి సర్వమంగళకారకుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. ఆయన అనుగ్రహం కోసం అనేక పద్ధతులలో శివారాధన చేయవచ్చు. అతి సులభంగా అతి సామాన్యుడికి సైతం అనుగ్రహించే భోళాశంకరుడు ఆయన. సాలెపురుగు, పాము, ఏనుగు, కన్నప్ప, బాలుడు మార్కండేయుడు ఇలా అనేక మంది తన భక్తులను అనుగ్రహించిన పరమ భక్త సులభుడు శివుడు. ఆయనను ఆరాధించే పద్ధతులలో కొన్ని తెలుసుకుందాం…
ఉమా అంటే మహేశ్వరితో కూడిన వాడైన పరమేశ్వరుడు. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
మనకున్న దారిద్ర్య బాధలు, ఇతర సమస్యలు పోవాలంటే శివుడిని కింద పేర్కొన్న విధంగా ఆరాధించాలని పండితులు పేర్కొంటున్నారు… సోమవారం ప్రాతఃకాలంలో లేచి తలస్నానం చేయాలి.
ఆ తరువాత పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టుపెట్టి దీపారాధన చెయ్యాలి. శివలింగానికి మంచి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత విభూదిని సమర్పిచి , ఆ విభూతిని నుదిటిన ధరించాలి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం.
అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. ఈ బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. తెల్ల లేదా ఎర్రగన్నేరు, తుమ్మి పూలు , మోదుగ పూలు, తెల్లజిల్లేడు పూలు శ్రేష్టమైనవి. తరువాత శివఅష్టోత్తరం చదువుతూ సాయంత్రం వరకు ఉపవాసము ఉండి శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లోనైనా శివుడి దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి . సాయంత్రము పరమశివునికి నైవేధ్యంగా నేతితో తాలింపు వేసిన దద్యోధనం ( పెరుగన్నం ) సమర్పించాలి.
ఇలా ప్రతి సోమవారం చేయడం వల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. అయితే చిత్తం శివుడి మీద పెడితేనే శివానుగ్రహం లభిస్తుందన్న విషయం మరచిపోవద్దు. శివ స్తోత్రాలు, శివపంచాక్షరీని నిరంతరం జపించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది. ఇలా కొన్ని వారాలపాటు వ్రతంగా భావించి పైన చెప్పిన విధంగా శివపూజ చేస్తే స్వామి అనుగ్రహం తప్పక లభిస్తుందని అనుభంతో అనేక మంది పేర్కొన్నారు. పండితులు, శాస్త్రాలలో ఉన్నది. మీరూ ఆచరించండి. స్వామి అనుగ్రహాన్ని పొందండి.