Maredu Plant : మారేడు చెట్టే మహా శివుడి రూపం.. కచ్చితంగా పూజలు చేయాల్సిందే!
Maredu Plant : హిందూ సంప్రదాయాల ప్రకారం మారేడు చెట్టుకు చాలా ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజు ఆ మహా శివుడికి ఇచ్చమైన మారేడు కొమ్మలను, మారేడ కాయను ప్రసాదంగా పెడుతుంటారు చాలా మంది. కానీ ఆ పరమ శివుడి స్వరూపం అయిన ఆ మారేడు చెట్టు గురించి మాత్రం పూర్తిగా తెలియదు. ప్రసాదాలుగా నివేదించడమే కాకుండా దని ప్రత్యేకత కూడా తెలుసుకోవాలి. అయితే మారేడు చెట్టును సామాన్య ప్రజలే కాకుండా మూడు కోట్ల మంది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. లోకంలో ప్రసిద్ధి చెందిన పుణ్య తీర్థాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు పొదలో ఉంటాయని మన పూర్వీకులు చెబుతుండేవారు. అంతే కాదండోయ్ మారేడు చెట్టు మహిమ గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది.
మారేడు చెట్టు మూలంలో లింగ రూపంలో మహా శివుడు ఉంటాడట. అలా ఉన్న మారేడు చెట్టు మూలాన్ని పూజించటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందట. అలాగే ఆ చెట్టు మొదట్లో స్నానం చేస్తే.. సర్వ పుణ్య తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చినంత పుణ్యం లభిస్తుందట. అలా చేసిన వాడే అసలైన పవిత్రుడని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుుతున్నారు.మారేడు చెట్టు కుదురు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేనట. ఆ కుదురు నీటితో తడిసి ఉన్నప్పుడు ఆ పరమ శివుడు చూస్తే… ఆయనకు ఎంతో ఆనందం కల్గుతుందట. అందుకే పరమేశ్వరుడి అనుగ్రహం పొందానుకునే వారు మారేడు చెట్టు మొదటిని ప్రతి రోజూ తడపాలని చెబుతుంటారు.
అంతే కాకుండా పసుపు, కుంకుమ, పుష్పాలతో మారేడు చెట్టు మూలాన్ని పూజించిన వారు శివ లోక అర్హతను కూడా పొందవచ్చట. అలాగే భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవాలంటే మారేడు చెట్టుకు భక్తి, శ్రద్ధలతో పూజలు చేయాల్సిందేనట. అలా ప్రతి రోజూ పూజ చేయడం వల్ల భక్తుల ఇంట సంతానం, సుఖం వర్ధిల్లుతూ ఉంటుందట. అందుకే మహా శివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన మారేడు కొమ్మలను, కాయలను స్వామి వారికి ప్రసాదంగా నివేదిస్తారు. ఇంతటి మహిమ గల మారేడు చెట్టుకు ప్రతి రోజూ లేదా శివుడికి ఇష్టమైన రోజుల్లో పూజ చేస్తే… మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే ఆ పరమ శివుడి స్వరూపం అయిన మారేడు చెట్టుకు పూజ చేయాలట.